నవదీప్ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. హీరోగా వచ్చినప్పటికి అని రకాల పాత్రలు పోషిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అతని కెరీర్‌లో దాదాపు స్టార్ హీరోలతో వర్క్ చేశాడు. కానీ నవదీప్‌కు ఇప్పుడు అంతగా సక్సెస్ రావడం లేదు. ఏ ప్రయోగం చేసినా కూడా బెడిసి కొడుతోంది. చివరగా ‘లవ్ మౌళి’ అంటూ వచ్చాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు పోయిందో కూడా చాలా మందికి తెలియదు. అయినా మళ్లీ సక్సెస్ కొట్టాలని నవదీప్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే వ్యాపారాల్లో తన మార్క్ వేయాలని చూస్తున్నాడు.
Also Read: Naga Chaitanya: ప్రపంచవ్యాప్తంగా ఉన్న రుచులన్నీ మీ కోసం ఒకే చోట
నవదీప్‌కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. చాలా సార్లు ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నవదీప్.. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటాడు. ఇందులో భాగంగా తాజాగా నవదీప్ కొత్తగా ఓ ట్రావెల్ కంపెనీ పెట్టినట్లు తెలుస్తోంది. ‘ఎన్ఎస్ 4 ట్రిప్స్’ అని నవదీప్ పెట్టిన ఈ కొత్త కంపెనీకి మంచు లక్ష్మీ, ప్రగ్యా, సీరత్ కపూర్ వంటి వారు ప్రమోషన్ చేస్తూ కనిపించారు. ఈ క్రమంలో నవదీప్ కొత్త కంపెనీ ఫస్ట్ ట్రిప్ లో మంచు లక్ష్మీ, ప్రగ్యా జైస్వాల్, సీరత్ కపూర్‌లదే అని, నవదీప్ వీరితో దగ్గరుండి మరీ తీసుకు వెళ్లినట్టుగా తెలిస్తోంది. ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ నవదీప్.