Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని క్రేజ్, ఆయన మాస్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి తాజాగా ఘటనే నిదర్శనం. ఆయన లేటెస్ట్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, నాని తన అభిమానుల కోసం చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. కేవలం సినిమా ప్రమోషన్లకే పరిమితం కాకుండా.. తనను గుండెల్లో పెట్టుకున్న ఫ్యాన్స్ కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్, చూపించిన ప్రేమ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం అవాక్కవుతున్నాయి. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ కు ముందు అభిమానులతో నేరుగా ముచ్చటించేందుకు, వారిలో ఉత్సాహం నింపేందుకు నాని ఓ భారీ ఫ్యాన్స్ మీట్ ను ప్లాన్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్ లోని ప్రముఖ సారధి స్టూడియోస్ లో ఏకంగా ఒక ఫ్లోర్ మొత్తాన్ని బుక్ చేశారు. తమ అభిమాన హీరోను కలుసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు పోటెత్తారు. దీంతో సారధి స్టూడియోస్ వద్ద వందల మీటర్ల మేర భారీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. ఆ జనసంద్రాన్ని చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
ఈ ఈవెంట్ లో అత్యంత సెన్సేషనల్ పాయింట్ ఏమిటంటే.. నాని చూపించిన ఓపిక! తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్క అభిమానితో ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఏమాత్రం విసుక్కోకుండా, అలసిపోకుండా గంటల తరబడి అలాగే నిలబడి.. తనను చూడటానికి వచ్చిన దాదాపు 10 వేల మందికి పైగా అభిమానులతో సెల్ఫీలు దిగుతూ నయా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఒక స్టార్ హీరో తన ఫ్యాన్స్ కోసం ఇంత సమయం గడపడం బహుశా ఇటీవల కాలంలో ఇదే తొలిసారి కావచ్చు. కేవలం ఫోటోలు, పలకరింపులతోనే ఆగిపోలేదు నాని. దూరాభారాల నుంచి తనకోసం వ్యయప్రయాసలకోర్చి వచ్చిన ఏ ఒక్క అభిమానీ ఆకలితో వెళ్లకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే ఈ ఫ్యాన్స్ మీట్ కు వచ్చిన 10 వేల మందికి పైగా అభిమానులకు స్వయంగా భారీ స్థాయిలో విందు భోజనాలు ఏర్పాటు చేయడం విశేషం. వచ్చిన ప్రతి ఒక్కరూ కడుపునిండా భోజనం చేసి, తమ హీరోతో ఫోటో దిగిన ఆనందంతో తిరుగుముఖం పడుతున్నారు.
Also Read
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!