Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?

Nani News

Nani News

యంగ్ హీరోలు చాలా మంది ఉన్నా, నాని ఉన్న క్రేజ్ మాత్రం సెపరేట్. ఫ్యామిలీ హీరోగా క్రేజ్ తెచ్చుకోవడం ఈ నేచురల్ స్టార్‌కు ప్లస్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్‌ను ఓవర్ యాక్షన్ మూవీస్ చెడగొట్టాయి. వరుస సినిమాల్లో రక్తపాతంతో విసిగిపోయిన నాని ఇక్కడి నుంచి బుద్ధిగా ఫ్యామిలీ హీరోలా ఉండాలనుకుంటున్నాడు. నాని సినిమా యావరేజ్‌గా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ చేశారు. కానీ హీరో యూటర్న్ తీసుకొని మాస్ ఇమేజ్ కోరుకున్నాడు. మాస్‌ను మెప్పిస్తేనే స్టార్‌డమ్ వస్తుందన్న నమ్మకంతో భారీ యాక్షన్ మూవీస్ చేయడం మొదలుపెట్టాడు. దసరా సక్సెస్ కావడంతో ‘హిట్ 3’, ‘ది పారడైజ్’ అంటూ రక్తపాతం సృష్టించాడు. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో ఇలా మితిమీరిన వైలెన్స్ చేయడం ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చలేదు. ‘పారడైజ్’ ఫ్లాప్‌తో నానికున్న క్రేజ్ మసకబారింది. దీంతో కొంతకాలం వీటికి గుడ్‌బై చెప్పి ఫ్యామిలీ మూవీస్ తీసే డైరెక్టర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని తెలిసింది.

‘పారడైజ్’ ఓజీ రిలీజ్‌కి ముందే నాని సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ మూవీకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా కూడా నరుక్కోవడమే మెయిన్ అజెండాగా ఉంటుందో లేదోగానీ, ఆ తర్వాత నాని నటించే సినిమాలన్నీ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ మూవీసే. తమిళంలో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ ఎమోషనల్ కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. విజయ్ సేతుపతి, త్రిషతో తీసిన ’96’, కార్తీ, అరవింద్ స్వామితో ‘సత్యం సుందరం’తో ఆడియన్స్ మనసును హత్తుకున్నాడు ప్రేమ్ కుమార్. ఈ లెక్కన నాని కోసం ఈయన ఎలాంటి భావోద్వేగాన్ని సృష్టిస్తాడో చూడాలి మరి. ‘ఇరుముడి’ వంటి బ్లాక్‌బస్టర్స్ తీసిన శివ నిర్వాణ నానితో తీసిన ‘నిన్ను కోరి’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘టక్ జగదీష్’ ఫ్లాప్ అయింది. ‘ఇరుముడి’ హిట్ తర్వాత నాని – శివ కాంబోలో సినిమా వార్తల్లో నిలిచింది. శివ నిర్వాణ సినిమా అంటే కథ ఫ్యామిలీ చుట్టూ తిరగడం ఖాయం. నాని లైనప్ చూస్తుంటే నాని యాక్షన్ నుంచి మళ్ళీ ఫ్యామిలీ వైపు యూటర్న్ తీసుకున్నాడనిపిస్తుంది.