Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nara Rohits Interview For His 20th Film Sundarakanda

Nara Rohith: ఈ సినిమా లైన్ చెబితే కంగారు పడ్డా.. కానీ అందరికీ కనెక్ట్ అవుతుంది!

Published Date :August 25, 2025 , 7:39 pm
By Bhargav Chaganti
Nara Rohith: ఈ సినిమా లైన్ చెబితే  కంగారు పడ్డా.. కానీ అందరికీ కనెక్ట్ అవుతుంది!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

సుందరకాండ భైరవం కంటే ముందే స్టార్ట్ అయిందా?
-నిజానికి కం బ్యాక్ సుందరకాండతోనే చేయాలి. 2022 లోనే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాము. డైరెక్టర్ వెంకటేష్ ఈ ఐడియా చెప్పినప్పుడు కంగారు పడ్డాను. ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అనిపించింది. ఐతే అదే సమయంలో వచ్చిన బ్రో డాడీ సినిమా ఒక విండో ఓపెన్ చేసింది. ఆక్వాడ్ గా ఉండే పాయింట్ అందంగా డీల్ చేసిన సినిమా అది. ఆ స్టైల్ లో చేస్తే వర్క్ అవుతుందనిపించింది. వెంకటేష్ ఒక 30 సీన్స్ రాసుకుని వచ్చాడు. నాకు చాలా నచ్చాయి. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ ఫేస్ లో ఒక స్మైల్ ఉంటుంది. లైటర్ వెన్ లో చాలా లైవ్లీగా మంచి ఫన్ తో ఉంటుంది.

మీరు ఈ మధ్యకాలంలో కొన్ని సీరియస్ పాత్రలు చేశారు.. ఇప్పుడు మళ్లీ నవ్వించే ఒక క్యారెక్టర్ చేస్తున్నారు ఎలా అనిపిస్తోంది?
-డైరెక్టర్ వెంకటేష్ నాతో ఐదేళ్లుగా ట్రావెల్ అవుతున్నాడు. మేము ఈ సినిమా కోసం చాలా డిస్కస్ చేశాము. అవన్నీ కూడా మాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఈ జనరేషన్ కి ఇది చాలా కొత్త కథ. క్యారెక్టర్ లో కొత్త ఎగ్జిట్ ఉంది. ఈ క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేశాను. సుందరకాండ చాలా క్లీన్ ఫిలిం. సీన్స్ ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా.

– ఇందులో నా క్యారెక్టర్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. 30 దాటినా కూడా కావలసిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెతకడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఆ కాంప్లికేషన్ నుంచే ఫన్ క్రియేట్ అవుతుంది.

-ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ సినిమా ఎలా ఉండబోతుందో నాకు డే వన్ నుంచి క్లారిటీ ఉంది. క్యారెక్టర్ ఆర్క్ లో ఉండి చేయడం అనేది డెఫినెట్ గా వెరీ చాలెంజింగ్.

ఇది ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ నా?
-ఈ ప్రేమ కథలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఇప్పుడే చెప్పలేను. ఇందులో హీరో కావలసిన ఫైవ్ క్వాలిటీస్ అనేవి చాలా పెక్యులర్. అవి మీరు స్క్రీన్ మీద చూడాలి. ఇందులో హీరో పడే సిచువేషన్ నుంచి సినిమా కామెడీ జనరేట్ అవుతుంది.

డైరెక్టర్ వెంకటేష్ గురించి ?
-వెంకటేష్ ఏ కథ అయితే అనుకున్నాడో ఆ కథని అద్భుతంగా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేశాడు. యూనిక్ కథని రాసుకున్నాడు. తను చాలా సెన్సిబుల్ డైరెక్టర్.

ఈ సినిమా ప్రొడక్షన్లో పార్ట్నర్ గా ఉన్నారు కదా.. మీ ఫ్రెండ్స్ చేస్తున్నారని జాయిన్ అయ్యారా?
-ఈ సినిమా నా ప్రొడక్షన్ లోనే స్టార్ట్ చేశాను. సంతోష్ నా కజిన్. తను ఎప్పటి నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు జాయిన్ అయ్యారు. గౌతమ్ రాకేష్.. వెంకీ చెప్పిన కథ నచ్చి జాయిన్ అయ్యారు. స్టోరీ కారణంగానే నలుగురం జాయిన్ అయ్యాం.

సిరి గారి క్యామియో గురించి?
-ఇందులో తన క్యామియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తను నా లక్కీ చార్మ్ అనుకుంటున్నాను. భైరవం డీసెంట్ హిట్. ఈ సినిమా కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది.

లియాన్ జేమ్స్ మ్యూజిక్ గురించి ?
-లియాన్ వండర్ఫుల్ పర్సన్. టెరిఫిక్ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమా చూసిన తర్వాత పాటలు మరింత కనెక్ట్ అవుతాయి. డియర్ ఐరా నా ఫేవరెట్ సాంగ్.

నరేష్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?
-ఆయన చాలా అనుభవం ఉన్న నటుడు. ఏ పాత్రనైనా చాలా అద్భుతంగా చేయగలరు. ఇందులో కూడా ఆయన క్యారెక్టర్ చాలా బావుంటుంది. అలాగే సత్య క్యారెక్టర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది.

మీకు ఇష్టమైన జానర్?
-నాకు రొమాంటిక్ కామెడీస్, అలాగే స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టం. మంచి స్పోర్ట్స్ డ్రామా, ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తాను.

వెంకటేష్ తోనే మరో సినిమా చేస్తున్నారని విన్నాం?
-అవును. దీనికి ముందు ఒక కథ రాసుకున్నాము. అది కచ్చితంగా చేయాలి. అది కూడా ఒక మంచి లవ్ స్టోరీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 20th film
  • August 27 2025
  • Nara Rohit
  • Romantic comedy
  • Sandeep Picture Palace

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions