విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ వేదికపై హీరో నారా రోహిత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులపై ఆయన చేసిన ‘స్వీట్ కంప్లైంట్స్’ ఈవెంట్ మొత్తానికి హైలైట్‌గా నిలిచాయి. ఎప్పుడూ సైలెంట్‌గా, డిసిప్లిన్‌గా ఉండే రోహిత్‌ను.. త్రివిక్రమ్, తమన్, వెంకటేష్ లపై కంప్లైంట్స్ చేయాలని యాంకర్ కోరడంతో ఆయన సరదాగా వారి గుట్టు విప్పేశారు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో పనిచేయడం వండర్ఫుల్ జర్నీ అని, ఆయన వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెబుతూనే ఓ ఫన్నీ కంప్లైంట్ ఇచ్చారు రోహిత్. “త్రివిక్రమ్ గారితో అంతా బాగుంటుంది కానీ.. ఆయన ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ మాత్రం చాలా టైం తీసుకుంటుంది” అంటూ మాటల మాంత్రికుడి నెమ్మది తనాన్ని పబ్లిక్‌గా బయటపెట్టారు.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై కూడా స్పందిస్తూ.. “ఆయన మంచి సాంగ్స్‌ను ముందుగా రిలీజ్ చేయకుండా దాచేశారు. ‘పోనీ టైల్ పిల్ల’ లాంటి సూపర్ సాంగ్‌ను జూక్ బాక్స్ కన్నా ముందే వదిలి ఉంటే బాగుండేది” అని అభిప్రాయపడ్డారు. ఇక హీరో వెంకటేష్‌పై కంప్లైంట్ ఇవ్వమంటే.. ఆయన సెట్లో ఎప్పుడూ స్పిరిచువల్ విషయాలు మాట్లాడుతూ నాలెడ్జ్ షేర్ చేస్తారని, ఆ మాటలు నేరుగా మనసులో నుంచి వస్తాయని ప్రశంసించారు. మరోవైపు హీరోయిన్ నివేతతో తనకు కాంబినేషన్ సీన్స్ లేకపోవడం వల్ల ఆమెపై ఎలాంటి కంప్లైంట్స్ లేవని చెప్పి తప్పించుకున్నారు. ఏదేమైనా ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి క్లాసిక్ సినిమాలను ఇష్టపడే రోహిత్.. అదే కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’లో ఒక మంచి పాత్ర చేయడం, స్టేజ్ మీద టీమ్ అందరితో ఈ రేంజ్లో సరదాగా ఇంటరాక్ట్ అవ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

