NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని వరుసగా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఓకే చేసిన ప్రాజెక్టులు, ముఖ్యంగా దసరా, హిట్ 3, ది ప్యారడైజ్ వంటి సినిమాలు పూర్తి రా అండ్ రస్టిక్ లుక్తో రక్తపాతంతో కూడిన సినిమాలుగా వచ్చాయి. ఈ భారీ యాక్షన్ కథల వల్ల నానికి మొదటి నుంచి ఉన్న ‘ఫ్యామిలీ ఆడియన్స్’ ఆదరణ మరియు సాఫ్ట్ ఇమేజ్ కాస్త తగ్గిందని విమర్శలు, ట్రోలింగ్ సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తన క్లాస్ అండ్ ఫ్యామిలీ ఇమేజ్ను తిరిగి కాపాడుకోవడానికి నాని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మాస్, వైలెంట్ సినిమాలే కాకుండా, కుటుంబ ప్రేక్షకులను అలరించే మంచి క్లాస్ చిత్రాలను పట్టాలెక్కించాలని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా ’96’ మరియు ఇటీవల ‘సత్యం సుందరం’ చిత్రాలతో హృదయాలను హత్తుకునే ఫీల్ గుడ్ సినిమాలను అందించిన తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను రెండేళ్ల పాటు లాగకుండా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే శరవేగంగా పూర్తి చేసి విడుదల చేయాలని ప్రణాళిక రచిస్తున్నారు. దీంతో పాటు, నానితో గతంలో ‘నిన్ను కోరి’, ‘తుక్ జగదీష్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణతో కూడా మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. శివ నిర్వాణ ‘ఇరుముడి’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. దాంతో మరోసారి శివతో ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనీ చూస్తున్నాడట. ఈ విధంగా వరుసగా క్లాస్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలను లైన్లో పెడుతూ నాని తన మాస్, క్లాస్ ఇమేజ్ల మధ్య సరైన సమతుల్యతను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!