NTV Telugu Site icon

Nani: 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలవడం పట్ల నేచురల్ స్టార్ నాని ఫస్ట్ రియాక్షన్..

Untitled Design (53)

Untitled Design (53)

ఊహించిన విధంగానే, నాని యొక్క హై-ఆక్టేన్ మాస్ మరియు యాక్షన్ చిత్రం దసరా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. ఆరు వేర్వేరు విభాగాలలో అవార్డ్స్ రాబట్టి జెండా ఎగరేసింది. ధరణి పాత్రలో నాని నటనకు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును సాధించాడు. ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శ్రీకాంత్‌ ఓదెల దసరా కథ, కథనానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. తన తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను అధిగమించి ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్న తొలి డెబ్యూ డైరెక్టర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

Also Read : FilmfareAwards: రికార్డు సృష్టించిన నేచురల్ స్టార్ నాని.. ఫిల్మ్ ఫేర్ చరిత్రలో మొదటిసారి..

దసరా సినిమాలోని విజువల్స్‌ అందించినందుకు సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సినిమాలోని అద్భుతమైన సెట్స్ గాను ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు దక్కించుకున్నాడు. ధూమ్ ధామ్ పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌ స్టెప్పులకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు గెలుపొందారు. శ్రీకాంత్ ఓదెలాతో పాటు నాని నటించిన ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ కూడా ఉత్తమ తొలి దర్శకుడిగా నిలిచాడు.

Also Read: Film Fare Awards 2024: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (కన్నడ ) 2024 విజేతలు ఎవరంటే..?

అవార్డు అందుకున్న అనంతరం నాని మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు నాకు ఎన్నో అవార్డులు రావాలనే కోరిక ఉండేది, కానీ కాలక్రమేణా ఆ కోరిక తగ్గింది. నాకు అవార్డుల కోసం ఇప్పుడు బలమైన కోరిక లేదు. అలా కాకుండా నా దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, నా సినిమాల్లో పరిచయమైన కొత్త టాలెంట్‌, ఇతర ఆర్టిస్టులు అవార్డులు అందుకోవాలనేది నా ప్రస్తుత కోరిక. అదే నన్ను చాలా ఉత్తేజపరుస్తుంది. ఈ రోజు, శ్రీకాంత్ మరియు శౌర్యువ్ అవార్డులు గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దర్శకులు శ్రీకాంత్‌ ఓదెల మరియు శౌర్యువ్‌ల విజయాలను పురస్కరించుకుని అవార్డు కార్డ్‌లను ఫోటోఫ్రేమ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. వారు కోరుకునే చోటికి చేరుకోవడానికి వారి ప్రయాణంలో నేను ఒక చిన్న భాగం కావడం నాకు గొప్ప అవార్డు. వారి తొలి అడుగుకు నేను ఒక చిన్న ఇటుక అయినా అందించినట్లయితే, అది నాకు సరిపోతుంది. 2023 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. దసరా మరియు హాయ్ నాన్నా ఇంకా ప్రత్యేకమైనవి” అని అన్నారు.

 

Show comments