69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తమిళం) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను అభినందిస్తూ తిరిగి వచ్చింది. ఫిలింఫేర్ గత సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించి నటీనటులకు అవార్డులు అందజేసింది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో పలువురు తారల నృత్యప్రదర్శనాలు ఆకట్టుకున్నాయి.
69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 (మలయాళం) విజేతల పూర్తి జాబితా::
* ఉత్తమ చిత్రం – డేర్‌డెవిల్ ముస్తాఫా
* ఉత్తమ దర్శకుడు – హేమంత్ ఎం రావు (సప్త సాగరదాచే ఎల్లో)
*ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) – పింకీ ఎల్లి (పృథ్వీ కోననూర్)
*ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు (Male) – రక్షిత్ శెట్టి (సప్త సాగరదాచే ఎల్లో)
* ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – పూర్ణచంద్ర మైసూర్ (ఆర్కెస్ట్రా మైసూర్)
* ప్రధాన పాత్రలో ఉత్తమ నటి (Female) – సిరి రవికుమార్ (స్వాతి ముత్తిన మలే హనియే)
* ఉత్తమ నటి (క్రిటిక్స్) – రుక్మిణి వసంత్ (సప్త సాగరదాచే ఎల్లో)
* సహాయక పాత్రలో ఉత్తమ నటుడు (Male) – రంగాయణ రఘు (తగరు పాలయ)
* సహాయక పాత్రలో ఉత్తమ నటి (Female) – సుధా బెలవాడి (కౌసల్య సుప్రజా రామ)
* ఉత్తమ సంగీత ఆల్బమ్ – సప్త సాగరదాచే ఎల్లో (చరణ్ రాజ్)
* ఉత్తమ సాహిత్యం – BR లక్ష్మణ్ రావు (యావ చుంబకా- చౌక బారా)
* ఉత్తమ నేపథ్య గాయకుడు (Male ) – కపిల్ కపిలన్ (నాధియే ఓ నదియే- సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఎ)
* ఉత్తమ నేపథ్య గాయని (Female) – శ్రీలక్ష్మి బెల్మన్ను (కదలను కాన హారతిరో- సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఎ)
* ఉత్తమ తొలి మహిళ – అమృత ప్రేమ్ (తగరు పాళ్య)
* ఉత్తమ తొలి పురుషుడు – శిశిర్ బైకాడి (డేర్‌డెవిల్ ముస్తఫా)
* లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – శ్రీనాథ్