NTV Telugu Site icon

Taraka Ratna: తండ్రిని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన కూతురు.. కన్నీధారను ఓదార్చేవారెవరు

Nandamuri Taraka Ratna Daughter Vishka

Nandamuri Taraka Ratna Daughter Vishka

Taraka Ratna: తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ప్రేమ ప్రత్యేకం. అందుకు కారణం ఆమెకు పుట్టినప్పటి నుంచి తాను చూస్తున్న ఒక హీరో తండ్రి కావటమే. తండ్రిలో ఆమె ఎప్పటికపుడు ఒక అభయ హస్తాన్ని చూసుకుంటుంది. అతని ప్రేమ ఒడిలో అనురాగం పంచుకుని ఆనందిస్తుంది. తండ్రీకుమార్తెల మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి కుమార్తెకు వాళ్ల నాన్నే రియల్ హీరో. ఆడించినా, లాలించినా, బుజ్జగించినా ఆమెకు కచ్చితంగా తండ్రి తోడు ఉండాల్సిందే. అలాంటి తండ్రి ఇక లేడని భావించి తన ఆరోగ్యం బాగాఉండి ఇంటికి తిరిగి వస్తాడనే వెయ్యికళ్లతో ఎదురుచూసే ఆచిట్టి తల్లికి నిరాస మిగిలింది. తండ్రి పార్థీవ దేహం చూసి నాన్న లే అంటూ ఆతండ్రి పార్థీవ దేహంపై చేయి పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిట్టి తల్లిని ఓదార్చడం అక్కడున్న వారి ఎవరితరం కాలేదు. ఇంత చిన్న వయస్సులో తండ్రిని కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న కూతురు విష్కను చూసి కుటుంబం మొత్తం కన్నీటి ధారలు ఏరులైపారింది. తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న విష్కను ఓదార్చేందుకు వారు విఫలయత్నం చేశారు. కానీ.. ఆచిట్టి తల్లి నాన్నా అంటూ తారకరత్నను చూస్తూ అక్కడి నుంచి కదలకుండా అలానే ఉండి ఏడుస్తూ వున్నా ఆచిన్నారిని మాత్రం ఎవరూ ఓదార్చలేకపోయారు.

Read also: Taraka Ratna Tatoo: తార‌క‌ర‌త్న చేతిపై బాలయ్య ఆటోగ్రాఫ్.. కన్నీరు తెప్పిస్తున్న జ్ఞాపకం

ప్రస్తుతం తారకరత్న మృతదేహాన్ని నివాసంలో ఉంచారు. ఆదివారం ఇంట్లోనే ఉంచుకుంటామని తెలిపారు. ప్రజల సందర్శన అనంతరం సోమవారం ఉదయం తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తారకరత్న అంత్యక్రియలను తండ్రి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నందమూరి తారకరత్న మృతి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవలే తారకరత్న సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఆయన రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా మారడం ఇలాంటి తరుణంలో కాలంచేయడం అందరినీ బాధిస్తోంది.
Worse in Narsinghi: నార్సింగీ లో దారుణం.. మద్యం తాగించి కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్

Show comments