నందమూరి బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. ఆయన చేస్తున్న సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి, షోలు బాగా ఆడుతున్నాయి. రాజకీయాల్లో కూడా ఆయన తిరుగులేనట్టు దూసుకుపోతున్నారు. ప్రస్తుతానికి ఆయన అఖండ సెకండ్ పార్ట్‌లో నటిస్తున్నారు. రాబోయే సినిమాలకు భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Supritha: అమెరికాలో సుప్రీత.. “ఎంత ముద్దుగున్నావే”!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అమెరికాలోని తానా సభలకు హాజరయ్యారు. అదే సభకు హాజరైన ఆయన తర్వాతి సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని, ఈ సినిమాలో బాలయ్య నెవర్ బిఫోర్ లుక్‌లో ఉండబోతున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు బాలకృష్ణలో చూడని కొత్త యాంగిల్‌ను చూపించబోతున్నానని, ఇంతకుముందే గోపీచంద్ మలినేని ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటిస్తూ, మాస్ ఎంటర్‌టైనర్‌గా సినిమా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ జరుగుతోంది.
Also Read: Sridevi: ‘కోర్ట్’ శ్రీదేవి హీరోయిన్ గా తమిళ చిత్రం
అఖండ పూర్తయిన వెంటనే ఈ సిన ిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఈ సినిమాను వృద్ధి సినిమా, థియేటర్ ఆఫ్ వెంకట్ సతీష్ కల్లూరి నిర్మించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను సమర్పించబోతోంది. అయితే, బాలకృష్ణలో ఏ యాంగిల్‌ను ఇప్పుడు చూపించబోతున్నారనే విషయంపై చర్చ జరుగుతోంది. గోపీచంద్ మలినేని ఎలా ప్లాన్ చేశారనేది చూడాలి.