Site icon NTV Telugu

Nandamuri Balakrishna: కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది.. సినీ ప్రముఖులు సంతాపం..

Krishnam Raju 1

Krishnam Raju 1

సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇవాళ (ఆదివారం) ఉదయం హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో క‌న్నుమూశారు. కృష్ణంరాజు ఇక లేర‌నే వార్త‌ను తెలుగ చిత్రసీమ కి షాకింగ్‌గా ఉంది. ఆయ‌న మృతి ప‌ట్ల రాజకీయ, సినీ ప్ర‌ముఖులంద‌రూ సోష‌ల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నంద‌మూరి బాల‌కృష్ణ ట్విట్టర్ ద్వారా సంతాప సందేశాన్ని షేర్ చేస్తూ కృష్ణంరాజుతో త‌న‌కున్న అనుబంధాన్ని తెలియజేశారు.

మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజుది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు కృష్ణంరాజు గారు. కృష్ణంరాజు గారితో కలసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. కృష్ణంరాజు గారితో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. కృష్ణరాజు గారు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఆయన ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకునేవాడిని. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

కృష్ణంరాజుకు సంతాపం తెలిపిన సినీ హీరోలు, నిర్మాతలు, ప్రముఖులు, సినీ ఇండస్ట్రీ.

Exit mobile version