యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో ఓ మాస్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. గత చిత్రాల తర్వాత తనకు ఒక మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టేలా ఈ చిత్రాన్ని అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు అఖిల్. ఇక ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ‘లెనిన్’ అనే ఇంట్రెస్టింగ్ పేరుతో ఫిక్స్ చేయగా, అఖిల్ పుట్టినరోజు సందర్భంగా (ఏప్రిల్ 8, 2025), విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్, సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఇందులో అఖిల్ లుక్, ఫైట్ సెటప్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ మాస్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ కలిగించాయి.
Also Read : PEDDI : ‘పెద్ది’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ .. ఇండియన్ సినిమాకు న్యూ బెంచ్‌మార్క్?
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అఖిల్ తండ్రి పాత్రలో నిజమైన తండ్రి నాగార్జున కనిపించబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ఈ పాత్రకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. నాగార్జున పోషించే ఈ పాత్ర సినిమాలో అత్యంత కీలకమైనది. కేవలం గెస్ట్ అప్పీరెన్స్‌గా కాకుండా, కథను ముందుకు నడిపించే, భావోద్వేగంతో కూడిన తండ్రి బంధం చూపించేలా ఉండబోతుందని టాక్. ఇప్పటికే మురళీ కిషోర్ ఈ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని, అతి త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా పాపులర్ హీరోయిన్ శ్రీలీల నటిస్తుండగా, ‘లెనిన్’ కథ మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఇందులో కుటుంబ విలువలు, తండ్రి కొడుకు మధ్య ఉన్న బంధం, సంఘర్షణలు, రాజకీయ ప్రభావం వంటి అంశాలు మిశ్రమంగా ఉండేలా చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు మాస్ యాక్షన్ హంగులు జోడించి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మరి ఈ సారి అయిన అఖిల్ కు హిట్ పడుతుందా చూడాలి.