కూలి సినిమాలో నాగార్జున సైమన్ అనే పాత్రలో మెరిశాడు. నిజానికి, ఆయన ధనుష్ హీరోగా రూపొందిన “కుబేర” సినిమాలో ఒక పాత్ర చేసినప్పుడు, ఇలాంటి పాత్ర ఎందుకు చేశాడా అని అందరూ అనుకున్నారు. అయితే, సైమన్ పాత్ర చూసిన తర్వాత మాత్రం వాళ్లందరి ఆలోచనలు మారిపోయాయి. నాగార్జున తన కెరీర్‌లో మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి యాంటాగనిస్ట్‌గా నటించాడు. ఒక స్టైలిష్ విలన్ పాత్రలో ఆయన ఆకట్టుకున్నాడు. ఆయన స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి విజిల్స్ పడ్డాయి. అంటే, నాగార్జున ప్రెసెన్స్‌ను ప్రేక్షకులు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
Also Read:Devara 2 : దేవర 2పై షాకింగ్ న్యూస్?
అయితే, కొంతమంది అభిమానులు నాగార్జున ఇలాంటి పాత్ర చేయడం ఏమిటా? అని ఆలోచనలో ఉంటే, మరి కొంతమంది మాత్రం ఇలాంటి రోల్స్ కదా నాగార్జున చేయాల్సింది! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి, ఆయన హీరో అయి ఉండవచ్చు, కానీ వరుసగా కొత్త పాత్రలు, విభిన్న రోల్స్ చూపిస్తేనే నేటి ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపధ్యంలో ఆయన చేసినది కరెక్టే అని అంటున్నారు.