ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హీరోలకు సమానంగా దర్శకుల పేర్లు కూడా మారుమ్రోగుతున్నాయి. ఇందులో డైరెక్టర్ శైలేష్ కొలను కూడా ఒకరు. తక్కువ బడ్జెట్ తో ‘హిట్ 1’ మూవీ తో వచ్చి మంచి విజయం సాధించి, హిట్ 2 కి అడివి శేష్ లాంటి క్రేజీ హీరో తోడై, ఇప్పుడు హిట్ 3కి ఏకంగా నానితో ఊహించని విధంగా ప్లాన్ చేశాడు. ప్రశాంతి తిపిర్నేని, నాని కలిసి నిర్మించిన ఈ వైల్డ్ మూవీ మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇప్పటికే శైలేష్ సినిమాటిక్ యునివర్స్ పేరుతో త్వరలోనే వీళ్లందరినీ కలిపేలా అవెంజర్స్ తరహా మూవీ ప్లానింగ్‌లో ఉన్నాట్లు పలు వార్తలు వినపడుతున్న విషయం తెలిసిందే. కానీ దానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోగా వేరే ప్రాజెక్టుని ఓకే చేసుకునే పనిలో పడ్డాడట. ఇందులో భాగంగా తాజాగా..
Also Read: Mohanlal : ఆయనతో మాట్లాడకపోతే నాకు రోజు గడవదు..
టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు శైలేష్ కొలను ఒక స్టోరీ చెప్పినట్టు టాక్. ఇంకా అధికారికంగా దీని గురించి తెలియనన్నటికి ఒక రౌండ్ చర్చలు జరిగాయట, శైలేష్ చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ వెర్షన్ డెవలప్ చేసుకుని రమ్మని అడిగారట నాగార్జున. సమాచారం ప్రకారం శైలేష్ ఆయనకు చెప్పిన కథ కూడా క్రైమ్ జానరేనట. బీహార్ లో సంచలనం సృష్టించిన ఒక హత్య చుట్టూ పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నారట. కేవలం ఇన్వెస్టిగేషన్ కోణంలోనే కాకుండా పొలిటికల్, సోషల్ ఇష్యూస్‌ని టచ్ చేయబోతున్నారని తెలిసింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా నిర్ధారణగా చెప్పలేం. ఇక చివరగా ‘నా సామిరంగా’ మూవీ తర్వాత నాగార్జున తెరమీద కనిపించలేదు. కానీ ఈ ఏడాది ఫుల్ లెంత్ లో కాకుండా స్పెషల్ రోల్స్‌లో సోలోగా ‘కుబేర’, ‘కూలి’ చిత్రాలో కనిపించబోతున్నాడు. దీంతో కింగ్‌ని చూడాలని అభిమనులు ఎదురు చూస్తున్నారు.