Karthi: కార్తి బర్త్‌డే ట్రీట్.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్

Naga Vamsi, Karthi Birthday, Meenakshi Chaudhary

Naga Vamsi, Karthi Birthday, Meenakshi Chaudhary

కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’ చిత్రాలతో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్టార్ హీరో కార్తి (Karthi) నేడు (మే 25) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కార్తికి బర్త్‌డే విషెస్ చెప్తూ ఒక అదిరిపోయే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Introduction) చేశారు.

కార్తి సరసన మోస్ట్ హాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రేజీ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ.. ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి వింటేజ్ మ్యాజిక్‌ను అందించబోతుందో హింట్ ఇచ్చారు. నిర్మాత నాగవంశీ తన అఫీషియల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కార్తితో ఉన్న ఒక అద్భుతమైన ఫోటోను పంచుకుంటూ ‘కార్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది మరొక ప్రత్యేకమైన సమయం.. కొన్నేళ్ల క్రితం మనం థియేటర్లలో ‘ఆవారా’ (Awara) సినిమా చూస్తున్నప్పుడు ఎలాంటి థ్రిల్, ఆనందాన్ని అయితే అనుభవించామో.. సరిగ్గా అలాంటి వింటేజ్ జాయ్‌ను మళ్లీ గుర్తుచేసేలా ఈ సినిమాలో కార్తి గారిని మీ ముందుకు తీసుకురాబోతున్నందుకు నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది . దీనిని మనం చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ’ అని నాగవంశీ పేర్కొన్నారు.

కార్తి కెరీర్‌లోనే ‘ఆవారా’ చిత్రం ఒక క్లాసిక్ లవ్ అండ్ రోడ్ జర్నీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఆ సినిమా పాటలు, కార్తి లుక్ ప్రేక్షకులకు ఫేవరెట్. ఇప్పుడు నాగవంశీ మళ్లీ అలాంటి సాలిడ్ వైబ్స్ ఉన్న క్యారెక్టర్‌తో కార్తిని ప్రెజెంట్ చేయబోతున్నట్లు స్పష్టం చేయడంతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి.