Karthi: కార్తి బర్త్‌డే ట్రీట్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’ చిత్రాలతో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్టార్ హీరో కార్తి (Karthi) నేడు (మే 25) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కార్తికి బర్త్‌డే విషెస్ చెప్తూ ఒక అదిరిపోయే అఫీషియల్ అనౌన్స్మెంట్ (Introduction) చేశారు.
కార్తి సరసన మోస్ట్ హాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్గా నటిస్తున్న ఈ క్రేజీ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ.. ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి వింటేజ్ మ్యాజిక్‌ను అందించబోతుందో హింట్ ఇచ్చారు. నిర్మాత నాగవంశీ తన అఫీషియల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కార్తితో ఉన్న ఒక అద్భుతమైన ఫోటోను పంచుకుంటూ ‘కార్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది మరొక ప్రత్యేకమైన సమయం.. కొన్నేళ్ల క్రితం మనం థియేటర్లలో ‘ఆవారా’ (Awara) సినిమా చూస్తున్నప్పుడు ఎలాంటి థ్రిల్, ఆనందాన్ని అయితే అనుభవించామో.. సరిగ్గా అలాంటి వింటేజ్ జాయ్‌ను మళ్లీ గుర్తుచేసేలా ఈ సినిమాలో కార్తి గారిని మీ ముందుకు తీసుకురాబోతున్నందుకు నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది . దీనిని మనం చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ’ అని నాగవంశీ పేర్కొన్నారు.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
కార్తి కెరీర్లోనే ‘ఆవారా’ చిత్రం ఒక క్లాసిక్ లవ్ అండ్ రోడ్ జర్నీ ఎంటర్టైనర్గా నిలిచింది. ఇప్పటికీ ఆ సినిమా పాటలు, కార్తి లుక్ ప్రేక్షకులకు ఫేవరెట్. ఇప్పుడు నాగవంశీ మళ్లీ అలాంటి సాలిడ్ వైబ్స్ ఉన్న క్యారెక్టర్‌తో కార్తిని ప్రెజెంట్ చేయబోతున్నట్లు స్పష్టం చేయడంతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
తాజావార్తలు
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..