Site icon NTV Telugu

War 2: సినిమా అంతా ఎన్టీఆర్ ఉంటాడు!

War 2

War 2

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమా ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార నాగవంశీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగవంశీ ఇంటర్వ్యూలు బయటకు వస్తున్నాయి. అయితే, ఊహించినట్టుగానే ఈ సినిమాలో కింగ్‌డమ్ కంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ గురించి వార్తలు, అలాగే నాగవంశీ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాల గురించే ప్రస్తావన వస్తుంది.

Also Read:Nidhi Agarwal : పవన్ కల్యాణ్‌ పై రూమర్లు నమ్మొద్దు.. నిధి అగర్వాల్ కామెంట్స్

ఇక తాజాగా ఆయన మాట్లాడుతూ, “ఎన్టీఆర్ నలభై నిమిషాలే ఉంటారు, అరగంటే ఉంటారు అనే ప్రచారం జరుగుతోంది, కానీ అది నిజం కాదు. సినిమా అంతా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఉంటారు. సినిమా మొదలైన 15-16 నిమిషాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇస్తారు. సినిమా మొత్తం ఇద్దరూ ఉంటారు. ఒక పాటలో ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తారు.

Also Read:Nidhi Agarwal : పవన్ కల్యాణ్‌ పై రూమర్లు నమ్మొద్దు.. నిధి అగర్వాల్ కామెంట్స్

ఫ్యాన్స్‌కి కావలసిన అన్నీ ఉంటాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ప్యాక్ చేసి ఉంటాయి. కాబట్టి, ఎందుకు ఈ సినిమా కొన్నాము అంటే, ఇవన్నీ ఉంటాయని తెలిసే కొన్నాము. అవన్నీ ఎలా ఉంటాయనేది నాకు కూడా తెలియదు. నేను కూడా ఆడియన్స్‌తో పాటు ఆ రోజు బెనిఫిట్ షో చూడటమే. కానీ జూనియర్ ఎన్టీఆర్ జడ్జిమెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి, మంచి సినిమా అవుతుందని నమ్మకంతో నేను సినిమా కొనుక్కున్నాను” అని వంశీ చెప్పుకొచ్చారు.

Exit mobile version