హ్యాట్రిక్ ప్లాప్స్‌ను తండేల్‌తో కవర్ చేసేశాడు నాగ చైతన్య. ఇక నెక్ట్స్ టార్గెట్ అప్పుడిచ్చిన గ్యాప్‌ను ఫిల్ చేయడమే. అందుకు తగ్గట్లుగానే పక్కా స్ట్రాటజీని అప్లై చేయబోతున్నాడు. ఇక బాక్సాఫీసును దుల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేయబోతున్నాడు. డాడ్ నాగ్ బాటలో పొరుగు దర్శకుడిపై ఫోకస్ చేస్తున్నాడట చైతూ. నిజానికి శోభిత మెడలో మూడు ముళ్లు వేశాక నాగ చైతన్యలో డ్రాస్టిక్ ఛేంజస్ కనిపిస్తున్నాయి. తండేల్ హిట్ కొట్టడం ఒకటైతే.. వంద కోట్ల హీరోగా మారడం మరో ఎత్తు. బౌన్స్ బ్యాకైన చైతూ.. వెంటనే విరూపాక్ష ఫేం కార్తీక్ వర్మ దండుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
Also Read:Anil Ravipudi : ట్రెండ్ సెట్ చేసిన అనిల్ రావిపూడి..
NC 24 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్‌కి వెళ్లింది. మైథాలాజీకల్ థ్రిల్లర్‌గా.. చైతూ కెరీర్‌లోనే నెవ్వర్ బిఫోర్ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్నట్లు టాక్. తండేల్‌తో వంద కోట్ల హీరోగా మారిన అక్కినేని వారసుడు NC 24తో 200 మార్కెట్ కొల్లగొట్టేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. కస్టడీ, తండేల్ మధ్య టూ ఇయర్స్ గ్యాప్ తీసుకున్న నాగ చైతన్య.. నెక్ట్స్ టైం ఇలాంటి సిచ్యుయేషన్ రాకుండా కేర్ తీసుకుంటున్నాడు. NC 24 సెట్స్‌పై ఉండగానే.. మరో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. తన మైల్ స్టోన్ మూవీ.. NC 25 కోసం ఇప్పటికే మజిలి రూపంలో తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ వేసిన శివ నిర్వాణకు ఛాన్స్ ఇచ్చాడని గట్టిగానే బజ్ వినిపిస్తోంది.
Also Read:Vishwambhara : ఓజీ ఓకే.. విశ్వంభర ఎప్పుడో..?
ఖుషీ యావరేజ్ హిట్ తర్వాత రెండేళ్లుగా మరో ప్రాజెక్ట్ చేయని శివను పిలిచి.. కలిసి పనిచేద్దామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున తన వందవ చిత్రం కోసం తమిళ దర్శకుడు ‘రా కార్తీక్’ని సెట్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పడు చైతూ కూడా మరో ప్రాజెక్ట్ కోసం ఓ కోలీవుడ్ డైరెక్టర్‌తో చర్చలు జరుపుతున్నాడట. సర్దార్ ఫేం పీఎస్ మిత్రన్.. చైతూను కలిసి స్టోరీ వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన కోసం ప్రతిసారీ కథ రాసుకుని వినిపించిన వెంకీ అట్లూరీతో మంచి సినిమాలు మిస్సైన చైతూ.. ఇకపై కాన్సెప్ట్ ఓరియెంట్ చిత్రాలపై కాన్సట్రేషన్ చేస్తున్నట్లే కనిపిస్తున్నాడు.