అక్కినేని నాగచైతన్య త్వరలో శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోబోతున్నారు. నాగచైతన్య తొలుత సమంతతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఆమెను వివాహం చేసుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తర్వాత నాగచైతన్య శోభితతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ వారు నిశ్చితార్థం జరుపుకొని ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీన జరగబోతోంది. ఈ మేరకు ఒక వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వివాహానికి ముందే నాగచైతన్య శోభితతో కలిసి గోవాలో సందడి చేశారు. అదేంటి వివాహానికి ముందే గోవా వెళ్లడం ఏమిటి అని అనుకోకండి.
Bihar: పోలీస్ క్వార్టర్‌లో ఇన్‌స్పెక్టర్ కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్య..కారణం?
వీరిద్దరూ వెళ్ళింది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం తరఫున అధికారికంగా నిర్వహించే ఫిలిం ఫెస్టివల్ కి వీరు హాజరయ్యారు. ఆ వేడుకకు సంబంధించిన రెడ్ కార్పెట్ మీద ఇద్దరు ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఇక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఎనిమిది రోజులపాటు జరగనుంది. ఇక ఈ వేడుకల్లో భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్దులు వేసిన నలుగురు ప్రముఖుల శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వారిలో అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, బెంగాలీ దర్శకుడు సైతం ఉన్నారు. వారికి నివాళులు అర్పిస్తూ వారి సినిమాలను కొన్నింటిని ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ వేడుకకు నాగార్జున సహా నాగార్జున కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.