Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!

Nag Ashwin

Nag Ashwin

దుల్కర్ సల్మాన్ నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ (I’m Game). ఈ సినిమా వేడుకలో పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రైలర్ చూసి ఇదొక హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ అని ఫిక్స్ అయిన ప్రేక్షకులకు, నాగ్ అశ్విన్ ఒక మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్‌ను లీక్ చేసి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ఈ సినిమాలోని కొన్ని రషెస్ తాను ఇప్పటికే చూశానని నాగ్ అశ్విన్ వేదికపై వెల్లడించారు. “ట్రైలర్ చూస్తే మీకు ఇది భారీ యాక్షన్ ఫిల్మ్ లా మాత్రమే కనిపిస్తుంది. కానీ అందులో ఎవరూ ఊహించని ఒక సర్ ప్రైజింగ్ కాన్సెప్ట్ దాగుంది. సినిమాలో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్, మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఫన్ ఉంది. థియేటర్లలో ఆ కాన్సెప్ట్ రివీల్ అయినప్పుడు ఆడియన్స్ కచ్చితంగా థ్రిల్ అవుతారు” అని నాగ్ అశ్విన్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఒక డైరెక్టర్ స్వయంగా ఈ కామెంట్స్ చేయడంతో ‘ఐ యామ్ గేమ్’ మూవీ అసలు ఇతివృత్తం ఏంటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

‘మహానటి’ సమయం నుంచి దుల్కర్ సల్మాన్ జర్నీని తాను చాలా దగ్గరగా చూస్తున్నానని నాగ్ అశ్విన్ కొనియాడారు. మంచి సినిమా కోసం, కొత్త కథ కోసం దుల్కర్ ఎంతకైనా తెగిస్తాడని, సినిమా అంటే ఆయనకున్న ప్యాషన్ అలాంటిదని ప్రశంసించారు. వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని తెలిపారు. ఇందులో కీలక పాత్రలు పోషించిన నటుడు పెపే, నటి సంయుక్తల యాక్టింగ్ చాలా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ మంచి సినిమాలను, కొత్త కథలను గుండెలకు హత్తుకోవడం అలవాటని గుర్తుచేసిన నాగ్ అశ్విన్.. సెప్టెంబర్ 3న విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. ఇక ఈ ఈవెంట్ చివర్లో హోస్ట్‌తో కలిసి ‘బర్నింగ్ క్వశ్చన్స్’ గేమ్‌లో పాల్గొన్న నాగ్ అశ్విన్, సరదాగా సమాధానాలు చెబుతూ 25 పాయింట్లు సాధించి అందరినీ ఉత్సాహపరిచారు.