NTV Telugu Site icon

Naagi : కల్కి – 2 కి చాలా టైమ్ పడుతుంది

Nagi

Nagi

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ కనిపించింది కాసేపే అయిన కూడా ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది. కానీ కర్ణుడుగా ప్రభాస్ ఫుల్ లెంగ్త్ రోల్ ను కల్కి – 2 లో ఉంటుంది,

Also Read : KA : మీకు అలా అనిపిస్తే నేను సినిమాలు మానేస్తా : కిరణ్ అబ్బవరం

దీంతో కల్కి – 2 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స ఎదుచూస్తున్నారు ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఎక్కడ కనిపించిన ఫ్యాన్స్ అడిగేది ఒకటే ప్రశ్న కల్కి -2 ఎప్పుడు అనే మాత్రమే. ఇదిలా ఉండగా దర్శకుడి నాగ్ అశ్విన్ గత రాత్రి అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడ కూడా ఇదే ప్రశ్న నాగికి ఎదురైంది. అందుకు బదులుగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘కల్కి -2 ఇప్పట్లో ఉండదు. అది రావడానికి చాలా టైమ్ పడుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స జరుగుతున్నాయ్’ అని అన్నారు. ఈ లోగా మీరు ఏదైనా మరో సినిమాను డైరెక్ట్ చేసేది ఛాన్స్ ఉందా అన్న ప్రశ్నకు అసలు రెండు లేదా మూడు సినిమాల వర్క్ కలిపితే కల్కి – 2 తో సమానం. సో ఇంకో సినిమా చేసే అవకాశమే లేదు అని బదులిచ్చారు. అన్ని అనుకున్నట్టు జరిగితే కల్కి -2 వచ్చే ఏడాది  చివరి నాటికీ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు నాగి.