Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mythri Sashi: ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్’ తెలంగాణ ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదిరింది. సంస్థ నిర్మించిన తాజా చిత్రం ‘జెట్‌లీ’ ప్రదర్శనను మల్టీప్లెక్స్‌లలో నిలిపివేయడంపై మైత్రీ భాగస్వామి కేతిరెడ్డి శశిధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎగ్జిబిటర్ల నిర్ణయాన్ని తప్పుబడుతూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. అసలు వివాదం ఏమిటంటే.. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వీకెండ్ రెంటల్స్, రెవెన్యూ షేరింగ్ నిబంధనలపై గత కొంతకాలంగా మైత్రీ సంస్థకు, ఎగ్జిబిటర్లకు మధ్య భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మైత్రీ సినిమాలను సింగిల్ స్క్రీన్లలో ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని మైత్రీ గౌరవించినప్పటికీ, తాజాగా ఆ వివాదాన్ని మల్టీప్లెక్స్‌లకు కూడా పాకించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సింగిల్ స్క్రీన్ సమస్యకు, మల్టీప్లెక్స్ ప్రదర్శనలకు ఎలాంటి సంబంధం లేదని శశిధర్ తన లేఖలో పేర్కొన్నారు.
“మల్టీప్లెక్స్ నిబంధనల విషయంలో మన మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అలాంటప్పుడు ‘జెట్‌లీ’ చిత్రాన్ని మల్టీప్లెక్స్‌లలో ఆపివేయడం కేవలం మమ్మల్ని ఒత్తిడికి గురిచేయడమే. ఒక విభాగంలో సమస్యను అడ్డం పెట్టుకుని, సంబంధం లేని మరో విభాగంలో ప్రదర్శనలు ఆపడం వ్యాపార ధర్మం కాదు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్ స్క్రీన్ సమస్యపై మొదటి నుంచి తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మైత్రీ సంస్థ స్పష్టం చేసింది. అయితే చర్చలు పారదర్శకమైన వాతావరణంలో జరగాలని, ఇలాంటి బలవంతపు పద్ధతులు పరిశ్రమకు తప్పుడు సంకేతాలు ఇస్తాయని లేఖలో హెచ్చరించారు. తక్షణమే పునరాలోచించి మల్టీప్లెక్స్‌లలో ‘జెట్‌లీ’ ప్రదర్శనకు అనుమతించాలని ఆయన కోరారు. మరి ఈ లేఖపై ఎగ్జిబిటర్ల సంఘం ఎలా స్పందిస్తుందో? ‘జెట్‌లీ’ సినిమాకు థియేటర్ల చిక్కులు వీడుతాయో లేదో వేచి చూడాలి.
Also Read
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
Official Statement from #Sasidhar Garu on behalf of @MythriRelease.#JetLee pic.twitter.com/dr8TxdlbRc
— Mythri Movie Distributors LLP (@MythriRelease) May 1, 2026
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు