Site icon NTV Telugu

చెర్రీ ఇంట్రడక్షన్ సాంగ్ కు 135 మంది మ్యూజిషియన్స్!

Music director is confirmed for Ram Charan and director Shankar's next

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘దిల్‌’ రాజు, శిరీశ్‌ నిర్మిస్తోన్న పాన్‌ ఇండియా మూవీకి మోస్ట్‌ హ్యపెనింగ్‌ యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఎస్‌. ఎస్‌. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్‌ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి. శంకర్‌ రూపొందించిన ‘బాయ్స్‌’ సినిమాలో నటించిన తమన్‌, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాలని ఆతృతగా తమన్‌ ఎదురు చూస్తున్నారు. శంకర్‌ నిర్మించిన ‘వైశాలి’ (ఈరం) చిత్రంతోనే తమన్‌ సంగీత దర్శకుడిగా తన కెరీర్‌ను స్టార్ట్‌ చేయడం విశేషం.

Read Also : మెగా ఫోన్ పట్టబోతున్న మరో కమెడియన్

“శంకర్‌గారు నిర్మించిన ‘వైశాలి’ (తమిళ ‘ఈరం’)కి ట్యూన్స్‌ ఇచ్చినప్పుడు, ఆయన వెంటనే మ్యూజిక్‌ బావుందని ఓకే చేశారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి గొప్ప డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది” అని తమన్ గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ రికార్డింగ్‌ పనిని హైదరాబాద్‌లో ఈ నెల 14,15వ తేదీల్లోనే ప్రారంభించారు. ఈ పాటను రికార్డ్‌ చేయడానికి శంకర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ భారీ సాంగ్‌ కోసం 135 మంది మ్యూజిషియన్స్ పని చేయడం విశేషం. ఇందులో రామ్‌చరణ్‌ కూడా భాగమయ్యారు. పాట విని చాలా ఎగ్జయిట్‌మెంట్‌కు ఫీలయ్యారు. ఈ భారీ బడ్జెట్‌ మూవీ దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తారు.

Exit mobile version