అశ్లీల చిత్రాల మేకింగ్ ఆరోపణలపై అరెస్టయిన రాజ్ కుంద్రా కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ విభాగం వారి దర్యాప్తును ముమ్మరం చేసింది. రాజ్ కుంద్రాను ప్రతిరోజూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కానీ దర్యాప్తు సమయంలో అతను నోరు తెరవడం లేదు. గత ఒకటిన్నర సంవత్సరాల్లో 100కు పైగా పోర్న్ సినిమాలు తీసినట్లు పోలీసులకు తెలిసింది. మరింత సమాచారం పొందడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్లూస్ బృందంతో కలిసి ముంబైలోని శిల్పా శెట్టి నివాసంలో దాడులు జరిపారు. పోలీసులు శిల్పా శెట్టిని కూడా ప్రశ్నించారు.
Read Also : ఆర్య, సయేషా సైగల్ దంపతులకు పండంటి బిడ్డ
అవసరమైతే అడల్ట్ స్టార్స్ షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేలను ప్రశ్నించవచ్చని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలియజేశారు. షెర్లిన్, పూనమ్ ఇద్దరూ తమ సొంత యాప్ లను కలిగి ఉన్నారు. ప్రత్యక్ష వీడియో చాట్‌ల సమయంలో వారు అశ్లీల దృశ్యాలు చేస్తారు. అంతకుముందు రోజు పోలీసులు రాజ్ కుంద్రాను మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అతడి కస్టడీని పొడిగించాలని కోర్టును కోరారు. అరెస్టు చట్ట విరుద్ధమని రాజ్ కుంద్రా న్యాయవాదులు కోర్టు ముందు వాదించారు. అయితే రాజ్ కుంద్ర కస్టడీని జూలై 27 వరకు కోర్టు పొడిగించింది.