రెండో స్థానంలో ‘ముగ్గురు మొనగాళ్ళు’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీనివాస్‌రెడ్డి, ‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, ‘వెన్నెల’ రామారావు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఫస్ట్ లుక్, ట్రైలర్ తోనే మంచి బజ్ ను క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదలైంది. దివ్యాంగులైన ముగ్గురు యువకులు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? దాని నుండీ ఎలా బయటపడ్డారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీనివాసరెడ్డికి వినపడదు, దీక్షిత్ శెట్టి మాట్లాడలేడు, ‘వెన్నెల’ రామారావుకు కనపడదు. ఈ ముగ్గురు నటులూ తమదైన శైలిలో నటించి, కథను రక్తి కట్టించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రెండో స్థానంలో తమ ‘ముగ్గురు మొనగాళ్ళు’ ట్రెండ్ కావడం ఆనందంగా ఉందని నిర్మాత ‘వెన్నెల’ రామారావు తెలిపారు. ‘గరుడ వేగ’ అంజి అందించిన విజువల్స్, సురేష్ బొబ్బిలి బాణీలు, చిన్న నేపథ్య సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలుగా నిలిచాయని ఆయన చెప్పారు. ఈ మూవీ ద్వారా అభిలాష్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇదిలా ఉంటే ‘వెన్నెల’ రామారావు నిర్మించిన ‘రోజ్ విల్లా’ మూవీ సైతం అక్టోబర్ 1న విడుదలైంది.
Also Read
- Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Aamir Khan: సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్‌కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?