Mugguru Kothulu : “తిడుతున్నా కొడుతున్నా” వదలను అంటున్న ‘ముగ్గురు కోతులు’ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో కొత్త కాన్సెప్ట్‌లు, క్యాచీ టైటిల్స్‌తో వచ్చే సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవలోనే ఇప్పుడు ‘ముగ్గురు కోతులు’ అనే వెరైటీ టైటిల్‌తో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినడానికి ఫన్నీగా అనిపిస్తున్నా.. ఇందులో అదిరిపోయే రొమాంటిక్ ట్రాక్ ఉందంటూ మేకర్స్ తాజాగా ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. “తిడుతున్నా కొడుతున్నా” అంటూ సాగే ఓ బ్యూటిఫుల్ ప్రేమ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా గ్రాండ్‌గా విడుదల చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో, ఆకట్టుకునే టైటిల్ సాంగ్ తో అటెన్షన్ డ్రా చేసిన ఈ సినిమా, ఇప్పుడు ఈ మెలోడీ సాంగ్ తో యూత్‌కి మరింత చేరువవుతోంది. ఎస్. సుహాస్ అందించిన వినసొంపైన బాణీకి, జగదీష్ అద్భుతమైన సాహిత్యం సమకూర్చారు.
చైతన్య, లాస్య తమ గాత్రంతో ఈ పాటను ఎంతో ప్లెజెంట్ గా మార్చారు. లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తుంటే.. ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాలా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతోందని స్పష్టమవుతోంది. పాటను లాంచ్ చేసిన అనూప్ రూబెన్స్ ఈ సాంగ్ వినడానికి చాలా బాగుందని ప్రశంసిస్తూ.. చిత్ర యూనిట్‌కు తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్గా నటిస్తోంది. రాజ్ నోముల సినిమాటోగ్రఫీ, జమీర్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మున్ముందు మరిన్ని క్రేజీ అప్డేట్స్తో ప్రేక్షకులను అలరించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
Also Read
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!