సిరియల్స్‌లో చిన్న క్యారెక్టర్స్‌లో అలరించి.. ప్రజంట్ బాలీవుడ్ టూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాగుర్. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదగాలి అంటే మాములు విషయం కాదు. చాలా సవాల్‌లు ఎదురుకొవాల్సి ఉంటుంది. అలాంటిది చిన్న సైడ్ క్యారెక్టర్ నుండి హీరోయిన్ గా మార్కెట్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రతి ఒక్కరి కెరీర్ లో గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా అంటూ ఒకటి ఉంటుంది. తాజాగా తన కెరీర్‌లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిన చిత్రమే లవ్ సోనియా అని మృణాల్ ఠాకూర్ అంటోంది.
Also Read : Narendra Modi : ప్రధానికి.. మహేశ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు – స్పెషల్ వీడియో
ఇటీవల ఈ సినిమా విడుదలై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగంగా ఒక పోస్ట్ షేర్ చేసింది.. మృణాల్ మాట్లాడుతూ “ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అమ్మాయిని నేను. వేల మందిలో నన్ను లవ్ సోనియాకి ఎంపిక చేసుకోవడం నిజంగా అదృష్టంగా అనిపించింది. ఇది నా మొదటి సినిమా మాత్రమే కాదు, జీవితాలను మార్చగలిగే సినిమా ప్రపంచంలోకి వేసిన తొలి అడుగు. ఆ సెట్లో పని చేసినప్పుడు కలిగిన భయం ఇంకా నాకు గుర్తుంది” అని పేర్కొంది. ఆమెతో కలిసి నటించిన డెమి మూర్, రిచా చద్దా, మనోజ్ బాజ్‌పేయీ లాంటి ప్రముఖ నటులు ప్రతిరోజూ కొత్తగా ఏదో నేర్పారని గుర్తుచేసుకుంది. “ఆ సమయంలో నేను విశాలమైన సముద్రం లో అతి చిన్న చేపల అనిపించుకున్నా. కానీ ఈ సినిమా నాకెంతో ఇచ్చింది – మాట్లాడే ధైర్యాన్ని, చిత్ర పరిశ్రమలో మరో కుటుంబాన్ని, ఒక కొత్త జీవనాన్ని” అని మృణాల్ భావోద్వేగంగా తెలిపింది. తనకు మద్దతుగా నిలిచి, ప్రేమను పంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, లవ్ సోనియా తన కెరీర్‌ని మాత్రమే కాకుండా, తన జీవితాన్ని కూడా మలిచిందని మృణాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.