సీతారామంతో తెలుగు వాళ్లకు సీతామహాలక్ష్మీగా చేరువైన మృణాల్ ఠాకూర్.. నార్త్‌లో హిట్ సౌండ్ విని ఆరేళ్లు కావొస్తోంది. 2019లో వచ్చిన బాట్లా హౌస్ తర్వాత బ్లాక్‌బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడలేదు. సీతారామంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, హాయ్ నాన్నతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ ఫ్యామిలీ స్టార్ ఆమె హ్యాట్రిక్ హిట్‌కు బ్రేకులేసింది. ఫలితంగా “గోల్డెన్ లెగ్” ట్యాగ్ మిస్ అయ్యింది.
బీటౌన్‌లో జెర్సీ నుండి మొదలైన ప్లాప్ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య ఓటీటీలకే పరిమితమైపోయింది మృణాల్. కొన్ని బోల్డ్ కంటెంట్ సినిమాలు చేసింది. వాటితో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారినా, హిట్ మాత్రం పడడం లేదు భామకు.
ఇక ఇప్పుడు హోప్స్ అన్నీ అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 పై పెట్టుకుంది.
Also Read:Rishab Shetty: 3 సినిమాలు.. 200 కోట్లు!
అప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ ఫిల్మ్, సయ్యారా, మహావతార నరసింహా చిత్రాల జోరుకు తట్టుకోలేక పూర్తిగా మునిగిపోయింది.
సినిమా చూసిన క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. రూ.150 కోట్లతో తెరకెక్కిన ఈ బొమ్మ రూ.100 కోట్లు వసూలైతే గ్రేట్‌నేనని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read:Spirit: ‘స్పిరిట్’ ఇంకా ఆలస్యం?
బాలీవుడ్‌లో ప్లాప్స్ పరంపర కొనసాగుతున్నా, సీతామహాలక్ష్మిగా పేరు తెచ్చుకున్న మృణాల్‌కు అవకాశాలు తగ్గడం లేదు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తోంది. అవి — హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో, పూజా మేరీ జాన్.
ఇవి కాకుండా తెలుగులో కూడా రెండు ప్రాజెక్ట్స్‌కు కమిట్ అయింది. అవి — అడవి శేష్ డెకాయిట్ చిత్రంతో పాటు, బన్నీ–అట్లీ కాంబోలో తెరకెక్కబోయే సినిమా. డెకాయిట్ ఈ ఏడాది క్రిస్మస్‌కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు మరియు హిందీ భాషల్లో రూపొందుతోంది.
మరి ఈ సినిమాతోనైనా మేడమ్ ఇటు బీటౌన్, అటు టీటౌన్‌లో ఒకేసారి హిట్ అందుకుంటుందా లేదా అనేది చూడాల్సిందే… లెట్స్ సీ!