Site icon NTV Telugu

Mr bachchan: గురూజీ క్యారక్టర్ తో అవమానించిన హరీష్.. ఎవరినో తెలుసా..

Untitled Design 2024 08 15t132856.497

Untitled Design 2024 08 15t132856.497

మొత్తానికి మాస్ మహారాజ రవితేజ – హరీశ్ శంకర్ మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్ థియేటర్లలోకి దిగింది. బుధవారం పైడ్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా గగ్రాండ్ గా రిలీజ్ అయింది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్ . పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఈ సినిమాపై రకరకాల రివ్యూస్ వచ్చాయి.

Also Read : Rajni : తెలుగు సినిమాకు నో చెప్పిన తమిళ సూపర్ స్టార్.. కారణాలు బోలెడు..

కాసేపు రివ్యూస్ ని పక్కన పెడితే ఈ సినిమాలోని ఓ క్యారక్టర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. సినిమాలో గురూజీ అనే పేరుతో ఒక క్యారెక్టర్ ని సృష్టించాడు హరీష్ శంకర్. అయితే ఈ రోల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశించి పెట్టినట్టు ఉందని కావాలనే త్రివిక్రమ్ మీద పంచులు వేయించినట్టు అనిపించిందని చర్చించుకుంటున్నారు నెటిజన్స్. సినిమాలో ఆ క్యారక్టర్ ను ప్రభాస్ శ్రీను తో వేయించాడు దర్శకుడు. అతనికి శ్రీనివాస్ అనే పేరు కూడా పెట్టడం యాదృచ్ఛికమో లేక కాకతాళీయమో తెలియదు కానీ హరీష్ పై త్రివిక్రమ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అది చాలదన్నట్టు మాంత్రికుడు అనే పదం మీద కూడా రవితేజ చేత కొన్ని పంచ్ డైలాగ్ లు వేయించాడు దర్శకుడు హరీష్. అయితే ఈ క్యారక్టర్ ఓ ప్రముఖ జర్నలిస్ట్ ను ఉద్దేశించి పెట్టారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 4 సినిమాల మధ్య పోటీగా లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ తో రిలీజైన మిస్టర్ బచ్చన్ పోటీని తట్టుకుని ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాడో వీకెండ్ ముగిస్తే కానీ తెలియదు.

Exit mobile version