నిధి అగర్వాల్‌ను బ్యాడ్ టైం వెంటాడుతుందో లేక నిధినే బ్యాడ్ ఫేజ్‌లో జర్నీచేస్తుందో కానీ కొన్నాళ్లుగా ఆమెకు లక్ ఫ్యాక్టర్ వర్క్ కావడం లేదు. ఇస్మార్ట్ శంకర్ తప్పా కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ చూడని నిధి అగర్వాల్‌తో సక్సెస్ దోబూచులాడుతోంది. హరి హర వీరమల్లు కోసం ఫైవ్ ఇయర్స్ టైం కేటాయించడంతో పాటు ప్రమోషన్లను తన భుజానపై మోసుకున్నా నో ప్రయోజనం. గ్లామర్ ట్రీట్ ఇచ్చినా వయ్యారాలు ఒలకపోసినా సినిమా బోల్తా కొట్టడం ఆమెకు మైనస్ అయ్యింది.
Also Read : Star Hero : కొడుకు నటిస్తున్న సినిమాలో భారీ మార్పులు చేస్తున్న స్టార్ హీరో..
ఇక ఇప్పుడు డార్లింగ్ రాజా సాబ్ కోసం కూడా మూడేళ్ల నుండి కష్టపడుతోంది నిధి అగర్వాల్. ఇదొక్కటే ఆమె చేతిలో ఉన్న ఫిల్మ్. కానీ వాయిదా పర్వంలో ఇయర్ స్టార్ట్ నుండి ఎండింగ్‌కు నెక్ట్స్ ఇయర్ జనవరికి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమా అయినా తన కెరీర్న్ మార్చేస్తుంది అనుకుంటే డిలేస్ ఆమె హోప్స్‌పై నీళ్లు చిలకరించాయి. ఇక వీటి సంగతి ఇలా ఉంచితే టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ మిరాయ్ లో స్పెషల్ సాంగ్ చేసింది నిధి. హీరోయిన్స్ అందరూ ఐటమ్ భామలుగా ఛేంజై ఆఫర్లు కొల్లగొడుతున్న వేళ నిధి కూడా అందాలు ఆరబోస్తూ ఫర్ ది ఫస్ట్ టైం మిరాయ్‌లో నిధి స్పెషల్ సాంగ్‌కు స్పెప్పులేసింది. కానీ సినిమా లెంత్, ఫ్లో మిస్, కథలో ఇరికించినట్లుగా ఉంటుందని నిధి ఐటం సాంగ్ ను ఎడిటింగ్ లో తీసేసారు మేకర్స్. ఇలా వరుసగా స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది నిధి. మరీ నెక్ట్స్ ఇయరైనా రాజా సాబ్ రూపంలో బ్లాక్ బస్టర్ దొరికి బ్యాడ్ ఫేజ్ నుండి బయటపడి ఆఫర్లు అందుకోవాలని రెబల్ స్టార్ ప్రభాస్ రాజుపైనే ఆశలన్నీ పెట్టుకుంది నిధి.
