మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో నాల్గవ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. మూవీకి “12th మ్యాన్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.
Read Also : “కిస్ మీ మోర్” అంటూ దిశా అట్రాక్టివ్ స్టెప్స్… వీడియో వైరల్
గతంలో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కలిసి “దృశ్యం” చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే విడుదలైన “దృశ్యం-2″తో మరోసారి మోహన్ లాల్ ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు జోసెఫ్. ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మోహన్ లాల్ హీరోగా “రామ్” అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి కూడా జీతూ జోసెఫ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం మోహన్ లాల్, జీతూ జోసెఫ్ మరో మిస్టరీ థ్రిల్లర్ కోసం కలిసి పని చేయబోతున్నారు. అదే “12th మ్యాన్”. ఇండస్ట్రీలో సాధారణంగానే స్టార్ హీరోలు తమకు హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్ళీ కలిసి పని చేయడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు. కొంతమంది హ్యాట్రిక్ కూడా కొడతారు. ఇప్పుడు అదే కోవలో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కూడా కొనసాగుతున్నారు.