నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల్ దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగుతుండగా.. నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్నారు. అనూహ్యమైన నాయకత్వంతో తమ గుర్తింపు కోసం పోరాడుతున్న అణగారిన తెగ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాను 2026 సమ్మర్‌లో మార్చి26న థియేటర్లకు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ పెను సంచలనమే సృష్టించగా, నాటి నుంచి నేటికి కూడా ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. అయితే ఇటీవల..
Also Read : OG :పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. OG సీక్వెల్ ఆఫీషియల్
తెలుగు అగ్రనటుడు మోహన్‌బాబు ఈ సినిమాలో నటిస్తునారన్ని ఆయన కుమార్తె మంచు లక్ష్మి ఓ వేడుకలో చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం బుధవారం మోహన్‌బాబు ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. కాగా మోహన్‌బాబుపై కీలక సన్నివేశాలను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారట. ఇందులో మోహన్‌బాబు, నాని మధ్య వచ్చే వచ్చే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయని ఇన్‌సైడ్ టాక్. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.