యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా, బండి సరోజ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా బండి సరోజ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రశంసలు అందుతున్నాయి. అయితే, తనను ప్రశంసిస్తూ వచ్చిన కామెంట్స్‌ను డిలీట్ చేస్తున్నారని బండి సరోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:Aadi Srinivas: కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు.. వారి వద్ద కోట్ల రూపాయలు దొరకడం ఏంటి?
బండి సరోజ్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు:
“పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్మిన్స్ నా గురించి వచ్చిన 400కి పైగా కామెంట్స్‌ను తొలగించారు. ఇంకా ఈ పని కొనసాగిస్తున్నారు. నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిశీలించాలని కోరుతున్నాను. ఈ చిత్రం కంటెంట్ ఆధారితమని, లాంచ్-ప్యాడ్ ఫిల్మ్ కాదని చెప్పారు. అందుకే నేను ఈ ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యాను. నా సర్వస్వం పెట్టి, ఎలాంటి షరతులు లేకుండా పనిచేశాను. కానీ ఇందుకు ఫలితంగా నా కామెంట్స్ డిలీట్ చేయడం జరిగింది. దీని వెనుక ఒక సీరియస్ సిండికేట్ ఉంది. ఇది ఆమోదయోగ్యమా? నిర్మాతపై నాకు పూర్తి నమ్మకం ఉంది. దీనిని పరిశీలించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.”
ALso Read:NTR-NEEL : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో హీరోయిన్ ఫిక్స్..
మరో పోస్ట్‌లో ఆయన ఇలా అన్నారు:
“కామెంట్స్‌ను లైట్‌గా తీసుకోమని చెప్పేవారికి నా సమాధానం ఇది. నేను ఇప్పటివరకు బయటి సినిమాలు ఒప్పుకోలేదు. సందీప్ రాజ్ ఒత్తిడితో కథ విన్న తర్వాత, నా పాత్ర నచ్చడంతో, ఎటువంటి మార్పులు ఉండకూడదనే ఒప్పందంతో, పారితోషికం లేకుండా 8 నెలలు నా సమయాన్ని ఈ సినిమా కోసం ఇచ్చాను. నా పాత్రకు వస్తున్న ఆదరణ చూసి ముందు థంబ్‌నెయిల్స్ మార్చారు, తర్వాత కామెంట్స్ ఆఫ్ చేశారు. దర్శకుడితో మాట్లాడిన తర్వాత మళ్లీ ఆన్ చేశారు. కొన్ని కామెంట్స్‌ను బాట్ లైక్స్‌తో బూస్ట్ చేసి, నా పాత్రకు వచ్చిన ఆదరణను సమంగా చూపించేందుకు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. ఇప్పుడు నా టాప్ కామెంట్స్‌ను డిలీట్ చేశారు. త్వరలో ప్రూఫ్స్‌తో మరింత వివరంగా మాట్లాడతాను.”
“1600 కామెంట్స్‌లో 99% నా పాత్రపై ప్రేక్షకులు చూపించిన ప్రేమే. నాకు పీఆర్ లేదు, ప్రేక్షకుల బలమే నా పీఆర్. ఆ సునామీని ఎవరూ ఆపలేరు. కానీ ఇప్పుడే ఇలాంటి చర్యలు తీసుకుంటే, సినిమా విడుదలయ్యాక ఏం చేస్తారు? ఎవరిని నమ్మాలి? నిర్మాత విశ్వప్రసాద్‌కు నేరుగా చేరే అవకాశం నాకు లేదు. నేను ఇండస్ట్రీలో బ్రతకడానికి రాలేదు. గత 5 ఏళ్లుగా నా కళతో ప్రేక్షకుల ప్రేమను సంపాదించాను. ఇలాంటి అభద్రతాభావం, నెపోటిజం, రాజకీయాలను నేను సహించను. వారి చర్యలను బయటపెడతాను. నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిశీలించాలని మరోసారి కోరుతున్నాను. ఇది నిర్మాతకు తెలియకుండా జరుగుతోందని నేను నమ్ముతున్నాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బంధుప్రీతికి అడ్డాగా మారకూడదు. నా బాధను, నా కెరీర్‌పై ఉన్న భయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.” అయితే తదనంతర పరిణామాల్లో బండి సరోజ్ కుమార్ పోస్టులు డిలీట్ చేయబడ్డాయి. ఈ అంశం మీద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందించాల్సి ఉంది.
