Model Nanditha K Shetty Cheated in the Name of Hunter Movie: సినిమాలో అవకాశం ఇప్పిస్తానని లక్షలు తీసుకుని మోసం చేసిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఉన్న ఆన్ లైన్ యాడ్ చూసి యువతి మోసపోయింది. మోడల్ నందితా కె శెట్టిని సురేష్ కుమార్ తమిళ చిత్రం హంటర్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. నందితా కె శెట్టి తాను మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో హంటర్ సినిమా ప్రకటనను చూసి అప్పుడు నేను అక్కడ ఉన్న కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసానని నందితా కె శెట్టి పేర్కొంది. సినిమాలో అవకాశం రావాలంటే ఆర్టిస్ట్ కార్డ్ ఉండాలని చెబితే దానికి 12,500 పంపానని ఆమె పేర్కొంది. ఇక అగ్రిమెంట్ స్టాంప్ డ్యూటీగా 35వేలు కూడా ఇచ్చి మోసపోయానని ఆమె పేర్కొంది.
Sanaya Irani: ఆడిషన్ కి పిలిచి పడుకుంటావా అని అడిగాడు.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలనం
ఆ తర్వాత షూటింగ్ కోసం మలేషియా వెళ్లాలి. మీ నాన్నగారి పాస్‌పోర్టు, మీ పాస్‌పోర్టు కావాలని ఫ్లైట్ టికెట్ కోసం సురేష్ 90 వేలు వసూలు చేశాడని ఆమె పేర్కొంది. ఇలా మొత్తం 1.71 లక్షలు పొంది సురేష్ కుమార్ తనను మోసం చేశాడని ఆమె పేర్కొంది. అనుమానం వచ్చిన నందితా కె శెట్టి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. యువతి ఫిర్యాదు మేరకు కోననకుంటె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. తమిళ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ 25వ చిత్రం హంటర్. ఈ హంటర్ సినిమా కోసం నటీమణుల కోసం ఆడిషన్ ఉందని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూసి నందిత తన వివరాలు పంపి మోసానికి గురైంది.