Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

Divyenndu Sharma (2)

Divyenndu Sharma (2)

కొంతమంది నటులకు స్టార్ ఇమేజ్ లేకపోయినా, వాళ్లు పోషించే ఒక్క పాత్రే వారి జీవితాన్ని మార్చేస్తుంది. ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో ‘మున్నాభయ్య’గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్యేందు శర్మ విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఆయన వెబ్ సిరీస్‌లతో పాటు వెండితెరపై, ముఖ్యంగా టాలీవుడ్‌పై గట్టిగా ఫోకస్ పెట్టారు. తాజాగా విడుదలైన ‘మిర్జాపూర్ ది మూవీ’ టీజర్‌లో మున్నాభయ్య లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే, దివ్యేందు శర్మ టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పెద్ది’లో ‘రామ్ బుజ్జి’ అనే పవర్‌ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటించి మంచి పేరు సంపాదించాడు. దీనితో పాటు వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రేజీ మూవీ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెంబర్ 47’లో కూడా దివ్యేందు ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలతో పాటు ఓటీటీలో ‘గ్లోరీ’, ‘సాలీ మొహబ్బత్’ వంటి సిరీస్‌లతో దూసుకుపోతున్న ఈ నటుడు టాలీవుడ్‌లో విలన్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.