హనుమాన్ సినిమాతో ఫ్యాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న తేజా, ఇప్పుడు మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. నిజానికి, ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ ఈ సినిమా ఒక వారం వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా అధికారిక సమాచారం రాలేదు, కానీ సెప్టెంబర్ 12వ తేదీన సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని 28వ తేదీన రిలీజ్ చేయబోతున్న ట్రైలర్‌తో పాటు ప్రకటించనున్నారు.
Also Read: Kollywood : స్టార్ హీరో నిర్మాణ సంస్థ లాంఛ్ కు కదిలొచ్చిన స్టార్స్
ఆ సంగతి అలా ఉంచితే, అసలు ఈ సినిమా వాయిదా పడడానికి గల కారణాలు ఏమిటనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అదేమిటంటే, ఈ సినిమా పూర్తిగా కంప్యూటర్ గ్రాఫిక్స్ బేస్డ్ సినిమా. సినిమాలో సింహభాగం కంప్యూటర్ గ్రాఫిక్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ అవుట్‌పుట్ సెప్టెంబర్ 1వ తేదీ నాటికి రెడీ అవుతుందని అంచనా వేసినప్పటికీ, ఒకవేళ వాటిలో ఏమైనా కరెక్షన్స్ చేయాల్సి వస్తే, అప్పటికప్పుడు చేసి 5వ తేదీ లోపు రిలీజ్ చేయడం కష్టం కాబట్టి, కాస్త సమయం తీసుకునేందుకు సెప్టెంబర్ 12వ తేదీన ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.
