Michael: వసూళ్ల వర్షం కురిపిస్తున్న మ్యూజికల్ డ్రామా ‘మైఖేల్’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ స్టార్ జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించిన మ్యూజికల్ బయోపిక్ ‘మైఖేల్’ భారత బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన 10 రోజుల్లోనే భారత్‌లో మొత్తం రూ. 46.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. రెండో ఆదివారం నాడు ఈ సినిమా రూ. 5 కోట్లు రాబట్టింది. మొదటి ఆదివారంతో పోలిస్తే వసూళ్లలో 28 శాతం తగ్గుదల కనిపించినప్పటికీ, రెండో శనివారంతో పోలిస్తే కేవలం 5 శాతం మాత్రమే డ్రాప్ అవ్వడం ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను తెలియజేస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద ‘క్లీన్ హిట్’ జోన్లోకి ప్రవేశించింది. ఈ ఏడాది భారత్‌లో విజయవంతమైన మూడవ హాలీవుడ్ చిత్రంగా (ప్రాజెక్ట్ హెయిల్ మేరీ, లీ క్రోనిన్ ‘ది మమ్మీ’ తర్వాత) ఇది గుర్తింపు పొందింది. కేవలం ప్రివ్యూల ద్వారానే రూ. 1.70 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, వీకెండ్స్‌లో భారీ వసూళ్లను నమోదు చేస్తూ కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఉన్న పాజిటివ్ ట్రెండ్ ప్రకారం, ఈ చిత్రం రెండో మంగళవారం నాటికి రూ. 50 కోట్ల మార్కును సునాయాసంగా దాటే అవకాశం ఉంది.
Also Read
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
- The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
ప్రస్తుత జోరును ఇలాగే కొనసాగిస్తే, ఈ బయోపిక్ తన లాంగ్ రన్లో రూ. 60 కోట్ల నుంచి రూ. 70 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైఖేల్ జాక్సన్ జీవిత విశేషాలను కళ్లకు కట్టినట్లుగా చూపించడం.. జాఫర్ జాక్సన్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుండటంతో, ఈ చిత్రం అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా మ్యూజికల్ ఎలిమెంట్స్ భారతీయ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
తాజావార్తలు
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!