Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్‌కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి (కొల్లి సురేష్) కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #Chiru158. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా మెగాస్టార్ చిరంజీవి తన 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ను లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి సరికొత్త మేకోవర్‌తో, ఊహించని రేంజ్ డెడికేషన్‌తో వర్క్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి మేకర్స్ రోజుకో సాలిడ్ అప్డేట్తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు.
నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ డిజైనర్ వివరాలను వెల్లడించిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ మెగా ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ అందించబోయే ఆ ‘టాప్ మ్యూజిక్ డైరెక్టర్’ ఎవరనేది అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకు టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ అండ్ స్టార్ మ్యూజిక్ సెన్సేషన్, ‘ఓజీ’ (OG) ఫేమ్ ఎస్.ఎస్. థమన్ (SS Thaman) సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. థమన్ రాకతో #Chiru158 ప్రాజెక్ట్‌కు మ్యూజికల్ గా అప్పుడే భారీ హైప్ వచ్చేసింది. బాబీ మార్క్ మాస్ ఎలివేషన్లకు, థమన్ మార్క్ ఇంటెన్స్ డ్రమ్స్ అండ్ బిజీఎమ్ తోడైతే థియేటర్లలో రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మరియు పాటల రికార్డింగ్ పనులు ప్రారంభం కానున్నాయని ఇండస్ట్రీ టాక్.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!