సినిమాలు షూటింగ్ చాలా వేగంగా చేస్తాడని పేరు ఉన్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు. అనుకున్న దానికంటే కాస్త ముందుగానే షూటింగ్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక కామిక్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మూడవ షెడ్యూల్ ఈ రోజు నుంచి కేరళలో మొదలైంది.
Also Read:Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే?
కేరళలోని అలప్పుజాలో మెగాస్టార్ చిరంజీవి, అయిన తార మీద ఒక సాంగ్ షూట్ చేస్తున్నాడు. రొమాంటిక్ సాంగ్‌గా చెప్పబడుతున్న ఈ సాంగ్‌ని భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ఒక మెలోడియస్ రొమాంటిక్ నంబర్ అని అంటున్నారు.
Also Read: NTV Exclusive: మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్న టాలీవుడ్ కమెడియన్?
ఇక ఈ సినిమా షూటింగ్ జూలై 23వ తేదీ వరకు జరగబోతోంది. ఆ తర్వాత తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లోనే ఆగస్టులో జరగబోతోంది. ప్లాన్ ప్రకారం కన్నా ముందే ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని అనిల్ రావిపూడి అండ్ టీం షూట్ చేస్తోంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేందుకు అనిల్, రాహుల్ అండ్ టీం డెడ్‌లైన్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్ కూడా దాదాపు రికార్డ్ బ్రేకింగ్ రేట్‌కి అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సాహు గారపాటి, సుస్మిత కొణిదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
