Site icon NTV Telugu

Mega Star: చిరు సినిమాకు నో చెప్పిన యంగ్ హీరోయిన్ ఎవరేంటే..?

Untitled Design 2024 08 18t124337.181

Untitled Design 2024 08 18t124337.181

చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. చిరు సరసన త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తోంది. త్రిషతో పాటు మ‌రో ఐదుగురు హీరోయిన్స్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి, అంజి వంటి చిత్రాల త‌ర్వాత మ‌రోసారి చిరంజీవి చేస్తోన్న సోషియో ఫాంట‌సీ మూవీ ఇది. బింబిసార చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు విశిష్ట రెండవ సినిమా విశ్వంభర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

Aslo Read: Tollywood : పుష్కరకాలం తర్వాత జోడీ కడుతున్న సూపర్ హిట్ జోడి

కాగా ఈ సినిమాలో సందర్భానుసారం ఓ స్పెషల్ సాంగ్ చిత్రీక‌రించాల్సి ఉంది. ఈ స్పెషల్ సాంగ్ లో చిరుతో కలిసి రొమాన్స్ చేసేందుకు హీరోయిన్ ను వెతికే పనిలో ఉంది యూనిట్. ఇందులో భాగంగా డాన్స్ డాల్ శ్రీలీల‌ను సంప్ర‌దించారు. భారీ రెమ్యున‌రేష‌న్‌ను ఇస్తామ‌ని చెప్పినా శ్రీలీల ఈ అఫర్ ను  సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం. అందుకు కార‌ణం లేకపోలేదు. ఇటీవల బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రంలో ఆయనకు కూతురిగా నటించింది శ్రీలీల. అదే వయసున్న చిరుతో ఐటం సాంగ్ చేయడం ఆమె కెరీర్ కు అంత కరెక్ట్ కాదని భావించి నో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో మేక‌ర్స్ మ‌రో హీరోయిన్‌ను వెతుక్కునే ప‌నిలో ఉన్నారు. విశ్వంభర సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేయ‌బోతున్నారు. కాగా ఆగ‌స్ట్ 22న మెగాస్టార్ పుట్టిన‌రోజు.. ఈ సంద‌ర్భంగా విశ్వంభ‌ర ట్రైలర్ తో పాటు, నెక్ట్స్ మూవీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా ఉంటుంద‌ని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విశ్వంభర ను యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు.

Exit mobile version