చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో నాగబాబు కీలక వ్యాఖ్యలు.. ఇంత సాధించిన మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు విమర్శిస్తారు? చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబాన్ని కూడా విమర్శిస్తారు.. ఎందుకు విమర్శిస్తారో ఇప్పటికీ నాకు తెలీదు. అన్న, తమ్ముడిని విమర్శిస్తే తాట తీస్తా… చిరంజీవి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు.. చిరంజీవిని ఏమైనా అంటే అడ్డంగా చీల్చేసే అభిమానులున్నారు. ఏదో చేయాలనే తపన ఉన్నవాడు పవన్ కళ్యాణ్. పవన్ డైరెక్టర్ అవుతానంటే హీరో చేశారు చిరంజీవి. ఏపీ రాజకీయ ముఖ చిత్రం మార్చే దమ్మున్న నాయకుడు పవన్. అలాంటి పవన్ ను ఏపీకి ఇచ్చిన వ్యక్తి చిరంజీవి.. కుళ్ళి పోయిన రాజకీయాలపై అన్నకి మద్దతు ఇచ్చాను. ఇప్పుడు తమ్ముడికి మద్దతు ఇస్తాను నాగబాబు
ఇక బన్నీ, చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్, వైష్టవ్, నిహారిక, శిరీష్ వీరందరి బంగారు భవిష్యత్ ఇచ్చాడు. అయినా మా అన్నయ్య రుణం తీర్చుకోలేం. చిరంజీవి ఎంత మంచి వాడో నాకు తెలుసు. అయినాకూడా.. కొంతమంది విమర్శిస్తుంటారు. చిరు అన్నయ్యను, పవన్ కళ్యాణ్‌ను ఎవరు విమర్శించినా నేను గట్టిగా కౌంటర్ ఇస్తాను.. అందుకు నన్ను కంట్రావర్సీయల్ పర్సన్ అంటున్నారు, మీరు ఏమనుకున్నా పర్లేదు. మా అన్నను.. తమ్ముడిని ఎవడైనా ఏదైనా అంటే మాత్రం సహించేది లేదు తాటతీస్తా.. అందులో ఏ డౌట్ లేదు.. అంటూ నాగబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Miss Universe beauty pageant: మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పెళ్లైన మహిళలకు అనుమతి