అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : Kollywood : అదును చూసి నయనతారపై రివెంజ్ తీర్చుకుంటున్నారు
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. మెగాస్టార్ పై యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ నుండి కాస్త ఎక్కవగానే రాబట్టాల్సి ఉంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నాన్ థియేటర్ రైట్స్ కనీసం రూ. 90 నుంచి రూ. 100 కోట్లు రాబట్టాల్సి ఉంది. చిరు పై ఈ ఇంత మొత్తం అంటే కాస్త కష్టం అనే టాక్ వినిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ప్లాపులు కారణంగా ఇటీవల చిరు సినిమాలకు డిమాండ్ కాస్త తగ్గింది. కానీ ఇక్కడ అనిల్ రావిపూడి అనే ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు థియేట్రికల్ రైట్స్ మాత్రం కాస్త భారీ గానే వచ్చేలా ఉంది. అనిల్ రవిపూడి సినిమా కావడం చిరు స్టైల్ వింటేజ్ కామెడీ నేపధ్యంలో ఈ సినిమా రాబోతుంది అనే బజ్ రావడంతో డిమాండ్ ఏర్పడింది. భారీ బడ్జెట్ పై తెరెకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
