May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ వంటి చిత్రంతో పలకరించిన తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయి మాసివ్ హిట్ మళ్లీ కనిపించలేదు. గత మూడు నెలలుగా చిన్న సినిమాలే ఇక్కడ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ రేసు నుండి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో లో- బడ్జెట్ చిత్రాలకు ఇది వరప్రసాదంగా మారింది. ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేందుకు చిన్న సినిమాల మేకర్స్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా కంటెంట్ కంటే కూడా ప్రమోషనల్ వీడియోలు వెరైటీ కాన్సెప్ట్‌లతో జనాలను ఆకర్షించేందుకు చిత్ర యూనిట్లు శ్రమిస్తున్నాయి. మే 1న విడుదలవుతున్న ‘జెట్లీ’, ‘గాయపడ్డ సింహం’ వంటి సినిమాల ప్రమోషన్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
డబ్బింగ్ సినిమాల చడీచప్పుడు లేని రాక ఒకవైపు తెలుగు స్ట్రైట్ సినిమాలు ప్రమోషన్ల కోసం నానా అవస్థలు పడుతుంటే భారీ అంచనాలతో వస్తున్న డబ్బింగ్ సినిమాలు మాత్రం తెలుగు ప్రచారాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ‘ఏక్ దిన్’ను తెలుగులో ‘ఒక రోజు’ పేరుతో విడుదల చేస్తున్నారు. సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడ భారీ ప్రమోషన్లు ఆశించినప్పటికీ మూవీ టీం మాత్రం హిందీలో ఒక ఈవెంట్‌తో సరిపెట్టేసింది. కనీసం ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా నిర్వహించకపోవడం గమనార్హం.
Also Read
నార్త్ నుండి సౌత్ వరకు అంతా సైలెంట్ రితేష్ దేశ్‌ముఖ్ జెనీలియా జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రాజా శివాజీ’ని కూడా తెలుగులో విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ దీని హడావుడి కేవలం నార్త్ బెల్ట్‌కే పరిమితమైంది. ఇక మాలీవుడ్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘పేట్రియాట్’ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి దిగ్గజ నటులు ఉన్నప్పటికీ తెలుగు వెర్షన్ రిలీజ్ విషయంలో క్లారిటీ కరువైంది. మే 1న ఈ సినిమా ఇక్కడ వస్తుందో లేదో అన్నట్లుగా ప్రమోషన్ల ఊసే లేదు.
నమ్మకమా, నిర్లక్ష్యమా పేరుకు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పడం అన్ని భాషల్లో విడుదల చేస్తున్నామని ప్రకటించడం వరకే మేకర్స్ పరిమితమౌతున్నారు. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఎలాగూ చూస్తారులే అనే ధీమానో లేక ప్రమోషన్ ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనో కానీ ఈ డబ్బింగ్ సినిమాలు మాత్రం ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నాయి. మరి మే 1న రాబోతున్న ఈ సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!