మాస్ మహారాజా రవితేజ 68వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేస్తూ సినిమా షూటింగ్ ప్రారంభం ‘ఆర్టీ68’ షూటింగ్ నేడు ప్రారంభమైందని వెల్లడించారు. ప్రస్తుతం చిత్రబృందం రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ప్రీ లుక్ లో రవితేజ కుర్చీపై కూర్చోని ఉండడం, అది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అని బోర్డు చూపించడం ఆసక్తికరంగా మారింది. నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథతో ఒక ప్రత్యేకమైన థ్రిల్లర్‌గా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రవితేజ ఇంతకుముందు ఎప్పుడూ చూడని పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also : ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’ ప్రారంభమైంది…!
ఈ చిత్రంలో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ మాండవ దర్శకత్వం వహిస్తున్నారు. నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్, ఎల్‌ఎల్‌పి బ్యానర్ లపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు స్వరకర్త సామ్ సిఎస్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్, ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్.