Site icon NTV Telugu

Raviteja: మాస్ జాతరతో లెక్కలు సరిచేయబోతున్న రవితేజ?

Raviteja

Raviteja

మాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతర అంటూ రచ్చ రంబోలా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు సాంగ్స్‌తో బొమ్మపై హైప్ క్రియేట్ చేస్తే.. రీసెంట్‌లో రిలీజ్ చేసిన టీజర్‌తో అన్నా మనం హిట్ కొట్టేయబోతున్నాం అంటూ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. దీనికి రీజన్ మూవీలో మాస్ ఎలిమెంట్సే కాదు.. రవితేజ పోలీస్ గెటప్‌లో కనిపించడం కూడా పాజిటివ్ వైబ్స్ తెస్తోంది. మాస్ మహారాజ్ ఖాకీ చొక్కా ధరిస్తే హిట్ కొట్టేసినట్లేనన్న టాక్ టాలీవుడ్‌లో బలంగా ఉంది. ఇప్పుడు ఈ టీజర్ ఫ్యాన్స్‌లో హోప్స్ తెచ్చినట్లయ్యింది.

Also Read:War 2: ‘వార్ 2’ చూసి, ఆపుకోండి… హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు పోలీసాఫీసర్ గెటప్స్ వేసినప్పటికీ.. రవితేజ యూనిఫామ్ ధరిస్తే ఆ లెక్కే వేరు. కలెక్షన్ల మోత మోగాల్సిందే. వెంకీ నుండి మొదలైన ఈ పరంపర వాల్తేరు వీరయ్య వరకు కంటిన్యూ అవుతోంది. మధ్యలో వన్ ఆర్ టూ ఫిల్మ్స్ తప్ప.. పోలీస్ గెటప్ వేసిన ప్రతి మూవీ కూడా సూపర్ డూపర్ హిట్సే. వెంకీలో ట్రైనీ పోలీసుగా ఫన్నీ యాంగిల్‌లో కనిపించిన రవితేజను.. సిన్సియర్ అండ్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో షిఫ్ట్ చేశాడు రాజమౌళి. విక్రమార్కుడులో విక్రమ్ సింగ్ రాథోడ్‌గా మాస్ మహారాజకు ఫిదా అయిపోయారు ఆడియన్స్.

Also Read:Anil Geela: మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది

మిరపకాయ్‌లో ఖాకీ గెటప్ వేయకపోయినా.. అండర్ కవర్ పోలీసాఫీసర్‌గా మెప్పించాడు రవితేజ. ఇవే కాదు పవర్‌తోనూ హిట్ అందుకున్న మాస్ మహారాజాకు టచ్ చేసి చూడు కాస్త దెబ్బేసింది. కానీ క్రాక్‌లో పోలీసాఫీసర్ పాత్రలో మెప్పించి ట్రాక్ ఎక్కేశాడు స్టార్ హీరో. ఇక అన్నయ్య చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో ఏసీపీ విక్రమ్ సాగర్‌గా కనిపించి.. ఆ హిట్టులో భాగం పంచుకున్నాడు. ఇక ఇప్పుడు మాస్ జాతరలోనూ రైల్వే పోలీసుగా కనిపించడంతో పాటు.. ధమాకాతో లక్కీ లేడీగా మారిన శ్రీలీల కూడా మరోసారి జోడీ కట్టడంతో ఈసారి అన్న బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నాడంటూ అంటున్నారు ఫ్యాన్స్. నాకంటూ ఓ హిస్టరీ ఉంది అంటూ మాస్ జాతరలో రవితేజ చెప్పినట్లుగా ఖాకీతో ఓ సెంటిమెంట్ వర్కౌట్ చేసి.. హిట్ కొట్టి.. హిస్టరీ క్రియేట్ చేస్తాడేమో.. నాలుగు ప్లాపుల లెక్కలు తేల్చేస్తాడేమో ఆగస్టు 27 వరకు వెయిట్ అండ్ వాచ్..

Exit mobile version