Raviteja: మాస్ జాతరతో లెక్కలు సరిచేయబోతున్న రవితేజ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతర అంటూ రచ్చ రంబోలా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు సాంగ్స్‌తో బొమ్మపై హైప్ క్రియేట్ చేస్తే.. రీసెంట్‌లో రిలీజ్ చేసిన టీజర్‌తో అన్నా మనం హిట్ కొట్టేయబోతున్నాం అంటూ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. దీనికి రీజన్ మూవీలో మాస్ ఎలిమెంట్సే కాదు.. రవితేజ పోలీస్ గెటప్‌లో కనిపించడం కూడా పాజిటివ్ వైబ్స్ తెస్తోంది. మాస్ మహారాజ్ ఖాకీ చొక్కా ధరిస్తే హిట్ కొట్టేసినట్లేనన్న టాక్ టాలీవుడ్‌లో బలంగా ఉంది. ఇప్పుడు ఈ టీజర్ ఫ్యాన్స్‌లో హోప్స్ తెచ్చినట్లయ్యింది.
Also Read:War 2: ‘వార్ 2’ చూసి, ఆపుకోండి… హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్
Also Read
ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు పోలీసాఫీసర్ గెటప్స్ వేసినప్పటికీ.. రవితేజ యూనిఫామ్ ధరిస్తే ఆ లెక్కే వేరు. కలెక్షన్ల మోత మోగాల్సిందే. వెంకీ నుండి మొదలైన ఈ పరంపర వాల్తేరు వీరయ్య వరకు కంటిన్యూ అవుతోంది. మధ్యలో వన్ ఆర్ టూ ఫిల్మ్స్ తప్ప.. పోలీస్ గెటప్ వేసిన ప్రతి మూవీ కూడా సూపర్ డూపర్ హిట్సే. వెంకీలో ట్రైనీ పోలీసుగా ఫన్నీ యాంగిల్‌లో కనిపించిన రవితేజను.. సిన్సియర్ అండ్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో షిఫ్ట్ చేశాడు రాజమౌళి. విక్రమార్కుడులో విక్రమ్ సింగ్ రాథోడ్‌గా మాస్ మహారాజకు ఫిదా అయిపోయారు ఆడియన్స్.
Also Read:Anil Geela: మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది
మిరపకాయ్‌లో ఖాకీ గెటప్ వేయకపోయినా.. అండర్ కవర్ పోలీసాఫీసర్‌గా మెప్పించాడు రవితేజ. ఇవే కాదు పవర్‌తోనూ హిట్ అందుకున్న మాస్ మహారాజాకు టచ్ చేసి చూడు కాస్త దెబ్బేసింది. కానీ క్రాక్‌లో పోలీసాఫీసర్ పాత్రలో మెప్పించి ట్రాక్ ఎక్కేశాడు స్టార్ హీరో. ఇక అన్నయ్య చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో ఏసీపీ విక్రమ్ సాగర్‌గా కనిపించి.. ఆ హిట్టులో భాగం పంచుకున్నాడు. ఇక ఇప్పుడు మాస్ జాతరలోనూ రైల్వే పోలీసుగా కనిపించడంతో పాటు.. ధమాకాతో లక్కీ లేడీగా మారిన శ్రీలీల కూడా మరోసారి జోడీ కట్టడంతో ఈసారి అన్న బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నాడంటూ అంటున్నారు ఫ్యాన్స్. నాకంటూ ఓ హిస్టరీ ఉంది అంటూ మాస్ జాతరలో రవితేజ చెప్పినట్లుగా ఖాకీతో ఓ సెంటిమెంట్ వర్కౌట్ చేసి.. హిట్ కొట్టి.. హిస్టరీ క్రియేట్ చేస్తాడేమో.. నాలుగు ప్లాపుల లెక్కలు తేల్చేస్తాడేమో ఆగస్టు 27 వరకు వెయిట్ అండ్ వాచ్..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!