NTV Telugu Site icon

Rajinikanth : వెట్టైయాన్ ఆడియో, ప్రీ వెన్యూ డేట్ ఇదే…

Untitled Design (31)

Untitled Design (31)

తమిళ స్టార్ హీరో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  జైలర్ హిట్ తో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం రజనీ తమిళ స్టార్ దర్శకుడు టీ. జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్  చిత్రంలో నటిస్తున్నాడు. టీ జే జ్ఞానవేల్ ప్రతిష్టాత్మికంగా ఈ ఈ పాన్‌ ఇండియా సినిమాని రూపొందిస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్  భారీ బ‌డ్జెట్ పై ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ లో రజినీ కాంత్ నటిస్తున్ననాలుగవ సినిమా వెట్టైయాన్ . ఈ సినిమాను దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా అక్టోబ‌ర్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు మూవీ మేకర్స్.

Also Read : Teja : దర్శకుడు తేజ చేతుల మీదుగా ప్రారంభమైన “ఈగిల్ ఐ సినీ స్టూడియో”

తాజగా ఈ సినిమా కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్ వెట్టైయాన్  ఆడియో, ప్రివెన్యూ ఈవెంట్ ను ఈ నెల 20న గ్రాండ్ గా చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. ఈ మేరకు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను షేర్ చేశారు.  ఈ చిత్రంలో రజనీతో పాటు  అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్‌ వెట్టైయాన్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రజనీకాంత్‌ 170వ చిత్రంగా ఈ సినిమా రానుంది. తెలుగులోను వెట్టైయాన్ ది వారియర్ పేరుతొ తీసుకురానున్నారు. ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ సింగిల్  అదిరిపోయే రెస్పాన్స్ రాబట్టింది. 

Show comments