కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ అఫ్ ఇండియా’. ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ దేశభక్తి చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ‘సన్ అఫ్ ఇండియా’ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చాలా సర్ప్రైజ్ అంశాలు ఉన్నాయట. ఈ చిత్రం నుంచి వరుసగా సర్పైజ్ లను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇలయరాజా సంగీతం సమకూర్చారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… విష్ణు భార్య, మోహన్ బాబు కోడలు విరానికా మంచు ఈ చిత్రానికి స్టైలిస్ట్‌గా పని చేస్తున్నారు.