Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రామాయణ’ పై 4000 కోట్ల బడ్జెట్ పెట్టారు. పాన్ ఇంటర్నేషనల్ మూవీ ‘వారణాసి’, 1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. రామాయణ, వారణాసి బడ్జెట్ షాక్ ఇస్తోంది. ఇందులో నిజం లేదని బాలీవుడ్ యాక్టర్ తేల్చి పారేసాడు. మరి రామాయణ, వారణాసి బడ్జెట్ ఎంత?
రాజమౌళి అంటేనే బడ్జెట్. తెలుగు తెరకే కాదు, ఇండియన్ సిల్వర్ స్క్రీన్కు భారీ బడ్జెట్, భారీ వసూళ్లు ఎలా ఉంటాయో చూపించాడు రాజమౌళి. తెలుగు సినిమా బడ్జెట్ 20 కోట్ల లోపే ఉన్న సమయంలో, ‘మగధీర’ పై 40 కోట్లు పెట్టించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల మార్కు దాటిన తొలి చిత్రంగా ‘మగధీర’ నిలిచింది. ఇక ‘బాహుబలి 2’ తో రాజమౌళి సెట్ చేసిన రికార్డులు ఇప్పటికీ కొన్ని చోట్ల పదిలంగానే ఉన్నాయి. మరి ఇంత ట్రాక్ రికార్డు ఉన్న రాజమౌళి, ‘వారణాసి’ తో పాన్ ఇంటర్నేషనల్‌కు పరిచయం అవుతున్నాడు. దీనికి తగ్గట్టే బడ్జెట్ పెంచేసాడు.
Also Read
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
- Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
‘వారణాసి’ 800 కోట్ల బడ్జెట్‌తో మొదలైంది. సెట్స్ పైకి వెళ్ళాక 1000 కోట్లు అన్నారు. ఏడాది పాటు షూటింగ్ పూర్తి చేశాక, 1300 కోట్లకు వెళ్ళిందన్నారు. సినిమా పూర్తి అయ్యేసరికి 1500 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్, రామాయణ, వారణాసి బడ్జెట్‌పై చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ సినిమాల బడ్జెట్ లెక్కలన్నీ కేవలం పిఆర్ (PR) టీం స్టంట్ అని ఆయన అభిప్రాయపడ్డాడు. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఇదే తంతు నడుస్తోందని, హైప్ కోసం చెప్పే నంబర్స్ అంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
4 వేల కోట్ల బడ్జెట్‌తో హిందీ ‘రామాయణ’ తెరకెక్కుతోంది. ఒక్కో పార్ట్‌కు 2000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాదాపు సగం పైగా బడ్జెట్ విఎఫ్ఎక్స్ (VFX) కే ఖర్చు పెడుతున్నారట. ఎన్ని కోట్లు పెట్టినా 4000 కోట్ల బడ్జెట్ అనేది నమ్మేలా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ফస్ట్ పార్ట్ హిందీ వర్షన్ థియేట్రికల్ రైట్స్‌ను 400 కోట్లకు అమ్ముదామని మేకర్స్ టార్గెట్ పెట్టుకుంటే, అందులో సగం కూడా వచ్చేలా కనిపించడం లేదు.
మనోజ్ బాజ్‌పాయ్ చెప్పిన పిఆర్ టీం బడ్జెట్ లెక్కల్లో ఎంత నిజం ఉందో లేదో గానీ, ఈ కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి. మనోజ్ నటిస్తున్న ‘గవర్నర్’ మూవీ 12న రిలీజ్ అవుతోంది. సినిమా వస్తోందన్న సంగతి చాలామందికి తెలియడం లేదు, అందుకే తన సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకే ఇలా మాట్లాడాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలాగని మనోజ్ కామెంట్స్‌లో నిజం లేదని చెప్పలేం. బడ్జెట్‌ను పెంచి చెప్పడం ఇండస్ట్రీలో కామనే అంటూ మరికొందరు మనోజ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.
తాజావార్తలు
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్‌లో కనిపిస్తున్న మృతదేహాలు..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!