Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌ అదిరిపోయింది!

Mandadi Teaser

Mandadi Teaser

Mandadi Teaser: సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మండాడి’. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాపై ఆసక్తి నెలకొనగా.. తాజాగా విడుదలైన ‘మండాడి’ టీజర్ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసింది. టీజర్‌లోని డైలాగ్స్, విజువల్స్, బోట్ సీక్వెన్స్, పడవ పందేలకు సంబంధించిన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘పందెమే మనల్ని కాపాడుతుంది.. పందెన్ని మనం కాపాడటం లేదు’, ‘బరిలోకి దిగే ప్లేయర్స్‌లో నిజాయితీ ఉంటే.. ఈ గాలి, సముద్రం మిమ్మల్ని ఎప్పటికీ ఒగ్గేయదు’ వంటి డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ కూడా టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టీజర్‌లో యాక్షన్, ఎమోషన్, డ్రామా, విజువల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో ‘మండాడి’పై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. పడవ పందేల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కాగా ‘మండాడి’ సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ భారీ స్థాయిలో విడుదల చేయనుంది. తాజా టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.